గత నెల రోజుల నంచి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా ప్రజాలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వర్షాలు భారీగా పడుతుంటే మరోవైపు ఈ రోడ్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు కూడా భారీగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా కొత్త ఆంధ్ర, రాయలసీమలో అయితే ఒకటే వర్షాలు.    

                                           

ఈ వర్షాల కారణంగా నిన్న విశాఖపట్నంలో స్కూల్స్ కు సెలువు ప్రకటించారు. అంత వర్షాలు వస్తున్నాయి అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న ఉత్తరాంధ్ర-దక్షణ ఒడిశా తీరాల మధ్య కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో విశాఖపట్నంలో కొన్ని పాఠశాలలకు సెలువు ప్రకటించాయి. 

                                            

ఈ అల్పపీడనం మరో 24 గంటలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా.. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే సూచనా ఉన్నందున కొన్ని పాఠశాలల యాజమన్యం సెలువు ప్రకటించింది. అయితే ఒక్క విశాఖలోనే కాదు కోస్తాఆంధ్రలో మరికొన్ని ప్రదేశాలలోను బారి వర్షాలు పడుతున్నాయి. ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే నీరు పూర్తిగా ఇళ్లల్లోకి వెళ్ళింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద నీటి ఉధృతి పెరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: