కే చంద్రశేఖరరావు మహా రాజకీయ దిట్ట. ఆయన వ్యూహాలు గొప్పగా ఉంటాయి. అపర చాణక్యుడు కూడా. అంతటి కేసీయార్ కొన్ని విషయాల్లో మాత్రం మరీ దారుణంగా వ్యవహరిస్తారని పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో అన్న గారు తాను ఏమనుకుంటే అదే కరెక్ట్ అనేవారు. ఆయనది రాజకీయ అనుభవలేమి అనుకున్నా కేసీయార్ మాత్రం అలా కాదు కదా. కానీ ఆయన మాత్రం పడితే మంకు పట్టే పడతారు. దానికి స్టికాన్ అయిపోతారు. ఈ మధ్యలో ఎవరు ఎలా మాట్లాడినా, చేసినా కూడా ఆయనకు శత్రువులు అయిపోతారు.


ఇక జగన్ విషయంలో ఉద్యమ కాలంలో కేసీయార్ వ్యవహరించిన తీరు వేరు. జగన్ పెద్ద నేతగా ఎదుగుతున్నాడని తెలిశాక రూటు మార్చుకున్నది వేరు, ఏపీలో చంద్రబాబు ఉంటే తన కన్నా నాలుగాకులు ఎక్కువ చదివారు కనుక ఓ విధమైన అభద్రతాభావం కేసీయార్లో ఉంది. అందుకు జగన్ సీఎం కావాలనుకున్నారు. ఇక్కడా రాజకీయమే ఉంది. అయితే జగన్ మాత్రం కేసీయార్ తో స్వచ్చమైన స్నేహమే  ఇప్పటివరకూ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన్ని ఇబ్బంది పెట్టింది కూడా లేదు. నిండు అసెంబ్లీ సభలో జగన్ మాట్లాడుతూ కేసీయార్ గొప్ప నాయకుడు, ఏపీ ప్రజల  పక్షపాతి అనేశారు. మరి అంతటి ఉదారత కేసీయార్ లో ఉందా. ఆయన జగన్ని తప్పు పడుతున్నారు. యువ ముఖ్యమంత్రి మీద గుస్సా అవుతున్నారు. దానికి కారణం ఆర్టీసీ సమ్మె, దానికి ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం. ఎపీలో జగన్ అది చేశారు.తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు చేయమన్నారు. 


దీని మీద కస్సుబుస్సులాడుతున్న కేసీయార్ అటు కార్మికులను విమర్శిస్తూనే ఇటు జగన్ని కూడా విమర్శించేశారు. ఏపీలో విలీనంపైన జగన్ చేసిందేంటి అంటూ కామెంట్స్ చేశారు. ఆయన ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. అది అయ్య్దేదా పోయేదా అంటూ ఎకసెక్కమే ఆడారు. మరి జగన్ విషయం తీసుకుంటే ఆయన హామీ ఇచ్చిన దాన్ని అమలు చేస్తూ పోతున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ విలీనం గురించి చేశారు.జగన్ చేస్తే ఒకే. ఆయన చేశాడు, నేను చేయను, చేయలేను అని చెప్పుకుంటే కేసీయార్ పెద్ద మనిషి అయ్యేవారు కానీ ఆయన అలా అనకుండా జగన్ చేయడమే తప్పు అన్నట్లుగా మాట్లాడడమే వింతలోకెల్లా వింత. పైగా జగన్ ఏమీ సాధించలేదు, విలీనం ఆయన చేయడు అంటూ విమర్శలు చేయడం దారుణమే. కేసీయార్ కి ఆర్టీసీ  సమ్మె తలబొప్పి కట్టిస్తోంది. మరి దానికి పరోక్షంగా  జగన్ తీసుకున్న విలీన నిర్ణయం కారణమని భావించే ఇలా కామెంట్స్ చేస్తున్నాడని అంటున్నారు. మరి దీని మీద జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: