మాజి ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత  అయిన చంద్రబాబు నాయుడుపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తీవ్రంగా  విరుచుకుపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం చంద్రబాబు గారు తాను  ఏం మాట్లాడుతున్నారో తెలియని అయోమయంలో ఉన్నారని ఆయన చెప్తున్నారు. చదివితే  ఉన్న మతిపోయింది  అన్నట్టు ఉంది ఆయన వైఖరి అని పలు వ్యాఖ్యలు చేసారు మంత్రి కన్నబాబు.

అంతా గందరగోళం గా మారింది,చంద్రబాబు గారు ప్రవర్తించే  శైలి అని,వ్యాఖ్యలు చేసారు. బోటును వెలికితీసిన ధర్మాడి సత్యంను టీడీపీ సన్మానించడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ.. చంద్రబాబు ధర్మాడి సత్యంకి  లేఖ రాసి ఆ లేఖలో ప్రభుత్వాన్ని,ప్రస్తుత సీఎం అయిన జగన్‌ మోహన్ రెడ్డిని  విమర్శించడం అసలు సరికాదన్నారు.ధర్మాడి సత్యం లాంటి వ్యక్తి మా కాకినాడలో ఉండడం,అందుకు మేము గర్వంగా  కూడా ఫీల్ అవుతున్నాం. అసలు బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యంకు అప్పగించింది మా ప్రభుత్వం కాదా..?’ అని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు  ప్రశ్నించారు.

మీరు ధర్మాడికి రాసిన లేఖ ఆయన దృష్టిలో సరైనదని భావిస్తే.. మరెప్పుడు రాజధాని తానే కట్టానని, హైటెక్‌సిటీ లాంటివి నిర్మించాను అంటూ  గొప్పలకు పోవద్దన్నారు. రాజధాని, హైటెక్‌సిటీ కట్టింది కాంట్రాక్టర్, తాపీ మేస్త్రీలు అన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలన్నారు. బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలను,బాధ్యతగల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించలేకపోయారు..?

మీ పార్టీ తరపున బోటు భాధితులకు,ఏమయినా  సహాయక చర్యలు అందించారా..? అని ప్రశ్నల వాన కురిపించారు.గతంలో ఆయన  హయాంలో జరిగిన పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి కారణం తాను కాదా ? అని పలు ప్రశ్నలు సంధించారు.ఆయనకు లేఖ రాసి  జగన్ పరిపాలన తీరుపై  వ్యాఖ్యలు చేయటం ఎంత వరుకు సమంజసం అని మండిపడ్డారు మంత్రి కన్నబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: