సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవాకార్యక్రమాలలో కూడా సహకారం అందిస్తూ రియల్ హీరో అనిపించుకుంటారు. సామాజిక కార్యక్రమాల కోసం మహేష్ బాబు తన నాయనమ్మ ఘట్టమనేని నాగరత్నమ్మ, రాజా పేరు మీద ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఎందరో చిన్నారుల విద్య చికిత్స కోసం గుప్త దానాలు చేస్తూ ఉంటారు. అటువంటి హీరో మహేష్ బాబు ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు.


సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని బుర్రిపాలెంలో ఫౌండేషన్ తరఫున పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ ఫౌండేషన్ తరఫున పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల, కళాశాల భవనాల మరమ్మతు, రోడ్ల నిర్మాణం, మంచినీటి వసతులను కల్పిస్తున్నారు.


ఈ క్రమంలోనే బుర్రిపాలెంను మరింత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో శుక్రవారం ఏపీ సీఎం జగన్ భార్య భారతిని కలిశారు మహేష్ భార్య నమ్రత.  గుంటూరు జిల్లాలోని మహేష్ బాబు తండ్రి కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెం అభివృద్ది సంబంధించిన పనుల గురించి భారతితో నమత్ర చర్చించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, నివేదికలను అందించారు. భవిష్యత్‌లో ప్రభుత్వం,గ్రామం ఫౌండేషన్ రెండు కలిసి బుర్రిపాలెం అభివృద్ది కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని తమ సొంతు ఊరు బుర్రిపాలెంను మహేష్ బాబు దత్తత తీసుకుని ఆయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను భారతికి వివరించారు నమ్రత.


రోడ్లు..వీధి లైట్స్..గ్రామంలోని పారిశుద్ద్యం తదితర అంశాలపై తాము దృష్టి సారించామని..మా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని నమ్రత..భారతిని కోరారు.తమ సహకారం తప్పకుండా ఉంటుందని భారతి మాటిచారని సమాచారం. నమ్రత కలవడం అంటే మహేష్ బాబు వెళ్లినట్టుగానే భావించాలి. గ్రామాభివృద్ధి కోసం మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.  ఈ సందర్భంగా మహేష్ బాబు చేపడుతున్న స్వచ్చంద కార్యక్రమాలను వైఎస్ భారతి ప్రశంసించినట్టు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: