ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా మాజీ రాజకీయ, దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోవడమే కాకుండా ఆయన్ని ప్రశంసిస్తూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను మంగళవారం నాడు ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంపై తీవ్ర రచ్చ జరుగుతుంది. భారతదేశాన్ని, భారతీయులను పదే పదే నీచంగా దూషించిన,మనకు  ఆగర్భ శత్రువైన కిస్సింజర్‌ను అంతర్జాతీయ రాజకీయ, దౌత్య సంబంధాల్లో మార్గదర్శకుడని వర్ణించడం ఏమిటని భారతీయ మేథావులు అనేక మంది విమర్శిస్తున్నారు.

1971లో భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా అమెరికా తరపున పాకిస్థాన్‌కు ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలను పంపించడమే కాకుండా, అదే సంవత్సరం భారత్‌కు వ్యతిరేకంగా చైనాను రెచ్చగొట్టిన యుద్ధోన్మాది కిస్సింజర్‌ను ఎలా ప్రశంసిస్తారని ప్రశ్నిస్తున్నారు. భారతీయులను ‘సన్స్‌ ఆఫ్‌ బిచెస్‌’ అని, ‘బాస్టర్డ్స్‌’ అని, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని ‘బిచ్‌’ అని విమర్శించిన కుసంస్కారిని అంతర్జాతీయ సంబంధాల మార్గదర్శిగా ఎలా అరుహులో అని అనేకమంది మేధావులు ఆశ్చర్యపడుతున్నారు.

బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్‌ అణచివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టిన రెండు నెలలకు అమెరికా యుద్ధ విమానాలు,  నౌకలు,ఆయుధాలను పాకిస్థాకు పంపించడం ద్వారా రెండు లక్షల మంది పౌరుల మృతికి అమెరికా కారణం అయింది  అని నాడు అమెరికా పార్లమెంట్‌లో పార్లమెంట్‌ సభ్యుడు ఎడ్మండ్‌ ముష్కీ విమర్శించడం గమనార్హం.

ప్రధాన మంత్రిగా, జాతీయవాదిగా నరేంద్ర మోదీ గారు , కిస్సింజర్‌ను అన్ని విధాల విమర్శించాల్సిందిపోయి ప్రశంసించడం  అసలు అంతుచిక్కని  లేదని మేథావులు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడో పదవుల నుంచి దిగిపోయి ఇప్పుడు 96 ఏళ్లు వచ్చిన కిస్సింజర్‌ ఏవిదంగా భారత్‌ భవిష్య దౌత్య సంబంధాలకు  ఏమాత్రం ఉపయోగపడరు. కనుక చారిత్రక విషయాలు తెలియని భారతీయ దౌత్యవేత్తలు మోదీని పక్కతోవ పట్టించి ఉంటారననే  విద్యావేత్తలు, మేథావులు భావిస్తున్నారు అని చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: