ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఎన్నికలు ఉన్నా..లేకపోయినా ఇక్కడ రాజకీయం రసవత్తరంగానే సాగుతుంది. అయితే పార్టీలు ప్రత్యర్ధ పార్టీలతోనే కాకుండా....సొంత పార్టీలో కొందరు నేతలతో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది.  ఏపీలో ఒకే పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగానే ఉంటాయి. సొంత పార్టీ నేతలనే తోక్కెసే రాజకీయం ఇక్కడ చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఒక టీడీపీ ఎమ్మెల్యేని అదే పార్టీలో ఉండే మాజీ మంత్రి ఒకరు రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు.


అలా సొంత పార్టీ నేతనే బలిపశువు చేయాలని చూస్తున్న మాజీ మంత్రి ఎవరో కాదు....టీడీపీలో ఎన్నో ఏళ్లుగా రాజకీయం చేస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు. ఈయన కృష్ణా జిల్లా మీద పెత్తనం చెలాయించడానికి ఎంతమంది టీడీపీ నేతలనీ పక్కకు తప్పించాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఆధిపత్యం వల్లే కొడాలి నాని లాంటి వారు సైతం పార్టీని వీడి ఇప్పుడు మంత్రిగా సెటిల్ అయిపోయారు. ఈ మేటర్ పక్కనబెట్టేస్తే.. ఉమాకు, విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు పెద్దగా పడదనే విషయం అందరికీ తెలిసిందే. 


గద్దెకు చెక్ పెట్టాలని ఉమా చాలాసార్లు ప్రయత్నించారు కూడా. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు ఈ క్రమంలోనే మరోసారి గద్దెని తోక్కేయాలని ఉమా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటికి తూర్పు సీటుని తన బంధువు దేవినేని అవినాష్ కు ఇప్పించుకోవాలని చూస్తున్న‌ట్టు సొంత పార్టీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ మేర వ్యూహాల కూడా సిద్ధం చేస్తున్నార‌ట‌. తెలుగుయువత అధ్యక్షుడుగా ఉన్న అవినాష్ మొన్న ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్కడ నాన్ లోకల్ కావడంతో ఓడిపోయానని అవినాష్ ఫీల్ అవుతున్నాడు. ఆయ‌న మ‌న‌స్సు కూడా తూర్పు మీదే ఉన్న‌ట్టు చెపుతున్నారు.


ఈ తరుణంలోనే వైసీపీ విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగిస్తామని పార్టీలోకి ఆహ్వానించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఉమా...అవినాష్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున తూర్పు టిక్కెట్ ఇప్పిస్తాన‌ని  చెప్పి మాట ఇచ్చార‌ట‌. దీంతో అవినాష్ పార్టీ మారకుండా ఉండిపోయార‌ని కూడా టాక్‌..? అయితే తన సీటు ఇస్తానని చెప్పడంపై గద్దె సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మొన్న అంత వైసీపీ గాలిలో కూడా గద్దె 15 వేల మెజారిటీతో గెలిచానని,  అలాంటి నియోజకవర్గాన్ని వదులుకోనని చెబుతున్నారు. దీనిపై అధినేతకు ఫిర్యాదు చేసేందుకు చూస్తున్నారు. కానీ ఉమా మాత్రం ఖచ్చితంగా తూర్పు నుంచి గద్దెని పంపేందుకే ప్రయత్నిస్తున్నార‌ని బెజ‌వాడ పాలిటిక్స్‌లో వినిపిస్తోన్న హాట్ టాపిక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: