ఆర్.నారాయణమూర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఎవరికీ వివరణ ఇవ్వనవసరం లేదు. సామాన్య ప్రజలకు ,వారికీ జరిగే అన్యాయాలను తెరమీద ఆవిష్కరించే  పీపుల్స్ స్టార్. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలో చూపించే రియల్  హీరో. ఆయన వెండితెర పై  ప్రజాపోరాటాన్ని చూపే అసలయిన స్టార్. ఈయన్ని  ప్రజల స్టార్ హీరోగా ముద్దుగా పిలుచుకుంటారు.పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా.. ఏమాత్రం సినిమా సంస్కృతిని ఒంటపట్టించుకోని ముక్కుసూటిగా పోయే  మనిషి. తాజాగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపించారు. 

సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మనస్పూర్తిగా తాను  అభినందిస్తున్నాఅని,జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల్ని అసలు ప్రాత్సహించలేదు. ఎవరైనా నాయకుడు పార్టీ మారాలని చూస్తే ఆ పార్టీకి, పదవికీ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 54 శాతం రిజర్వేషషన్లు కల్పించిన ఏకైక  నాయకుడు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అని ప్రశంసించారు.మార్కెట్‌లో ప్రజాస్వామ్యం  అనే సినిమాను మీరందరూ చూడండి, ఆదరించండి,చూపించండి అని చెప్పారు. 

భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని,ఓటుకు నోటు, రూ.100 కోట్లు పెడితే ఎమ్మెల్యే, 200 కోట్లు పెడితే ఎంపీ టికెట్ అంటూ  ప్రజాస్వామ్యం ధన స్వామ్యం అయిపోయింది నేడు . ప్రజాస్వామ్యం సంతలో సరుకైపోయింది. ప్రజాస్వామ్యన్ని పరిరక్షించడం ద్వారా మన అందరి బతుకులు బాగుంటాయి అనేది ఈ చిత్ర సారాంశం .

ఇసుక,జల సంపద వంటి విషయాల మీద సినిమా చూపించనున్నారని, భారత దేశంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతి సంపద, మూల సంపద అయిన ఇసుకను ఏ వ్యక్తుల చేతుల్లో లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి అని ఆయన అన్నారు. కాగా, నవంబరు 29న మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా విడుదల కానుంది అందరు తప్పకుండ చూడాలి అంటూ సభను ముగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: