రాజ‌కీయాల్లో నాయ‌కులు చేసే వ్యాఖ్య‌లు, వేసే అడుగులు చాలా చిత్రంగా ఉంటాయి. త‌మ‌కు అవ‌కాశం ఉంటే ఒక‌లాగా.. అవ‌కాశం లేక‌పోతే.. మ‌రోలా నాయ‌కులు ఎప్ప‌టికప్పుడు మాట‌లు మార్చేస్తూ ఉంటారు. తాజాగా ఏపీతో స్నేహం చేస్తున్న తెలంగాణ సార‌థి, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. చేసిన రాజ‌కీయ వ్యాఖ్య‌లు రాష్ట్రంలో విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. ఆయ‌న‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌ను ఆయ‌న స్వ‌యంగా ప‌రిష్క‌రించుకో కుండా దానిని ప‌క్క‌రాష్ట్రానికి పాకించేలా వ్యాఖ్యానించ‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్పు ప‌డుతున్నారు. గ‌డిచిన 20 రోజులుగా తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె జ‌రుగుతోంది.


తెలంగాణ ఉద్య‌మ స‌మయంలో మ‌న‌కు ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే ఆర్టీసీని ప్ర‌భుత్వంలోకి విలీ నం చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో త‌మ బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌ని బావించిన ఆర్టీసీ కార్మి కులు క‌దం తొక్కి తెలంగాణ ఉద్య‌మంలో అన్నీతామై వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు ఆరు సంవ‌త్స రాలు గ‌డిచిపోయిన త‌ర్వాత ఈ హామీ మాటేంట‌ని వారు సీఎం కేసీఆర్‌ను ప్ర‌శ్నించ‌డం, నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం, ఆ వెంట‌నే స‌మ్మెకు దిగ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ స‌మ్మె విష‌యంలో అటు కేసీఆర్‌, ఇటు ఆర్టీ సీ యూనియ‌న్లు కూడా ప‌ట్టు విడుపుల ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌డం మానేసి ఎవ‌రికి వారు పంతాల‌పోయారు.


దీంతో స‌మ్మె మ‌రింత ఉదృతంగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే విలీన ప్ర‌తిపాద‌న‌ను కేసీఆర్ నిర్ద్వంద్వం గా తోసిపుచ్చారు. ఎట్టి ప‌రిస్తితిలోనూ విలీనం చేసేది లేద‌న్నారు. యూనియ‌న్ల కార‌ణంగానే ఆర్టీసీకి న‌ష్టా లు వ‌స్తున్నాయ‌న్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అదేస‌మ‌యంలో ఆయ‌న ఏపీ విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చారు. ఏపీలో ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసే దిశ‌గా ఇక్క‌డి సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా రు. వాస్త‌వానికి ఇది ఆయ‌న హామీ కాదు. అయిన‌ప్ప‌టికీ.. కార్మికుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌నే ఏకైక ఉద్దేశం తో ఆయ‌న ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విలీన ప్ర‌తిపాద‌న‌పై జ‌గ‌న్ ఓ క‌మ‌టీని నియ‌మించారు.


అయితే, ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నించారు. ``ఏపీలో విలీనంపై క‌మిటీ వేశారు అంతే! అక్క‌డే జ‌రిగిలేదు. అస‌లు జ‌రుగుతుందో లేదో కూడా తెలియ‌దు. క‌మిటీ ఏం చెబుతుందో చూడాలి. ఇదంతా అయ్యేందుకు నాలుగు నుంచి ఆరు నెల‌లు ప‌డుతుంది. విలీనం అయ్యేటిదికాదు, పోయేటిదికాదు!`` అని వ్యాఖ్యానించారు. దీంతో ఏపీలో ఆర్టీసీ కార్మికులు డోలాయ‌మానంలో ప‌డ్డారు. ఇదేదో ఇబ్బందిగానే ఉంద‌ని, ప్ర‌భుత్వం త‌మ‌ను మోసం చేయాల‌ని చూస్తోందా? ఏంటి? అని వారు అప్పుడే స‌మాలోచ‌న‌లు ప్రారంభించేశారు. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం విలీనం ఖాయ‌మ‌ని అన్నారు.

అంతేకాదు, కేవ‌లం క‌మిటీ సూచ‌న‌లు మాత్ర‌మే చేస్తుంద‌ని విలీనం అనేది ఆగ‌ద‌ని ఆయ‌న చెప్పారు. అయితే, కేసీఆర్ మాత్రం త‌న రాష్ట్ర స‌మ‌స్య‌ను త‌ప్పించుకునేందుకు ఏపీలో విలీన ప్ర‌క్రియ‌పై నీలినీడ‌లు క‌మ్ముకునేలా వ్యాఖ్యానించ‌డాన్ని అంద‌రూ త‌ప్పుప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇలా అయితే ఏపీ, తెలంగాణల స్నేహం.. మూణ్నాళ్ల ముచ్చ‌టే అవుతుంద‌ని కూడా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: