ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈ మధ్యకాలంలో ఎలా చెట్టాపట్టాలేసుకుని తిరిగారో అందరికీ తెలిసిందే. కానీ కేసీఆర్ మాత్రం చాలా త్వరగానే జగన్ భుజాలపై నుండి చేతులు తీసేసాడు. జగన్ తీసుకున్న ఒక నిర్ణయం కారణంగానే తెలంగాణలో ఆర్టీసీ కార్యకర్తలు తనపై ఉద్యమించారని నమ్ముతున్న కేసీఆర్ చాలా రోజులు నిబ్బరంగా ఉన్నాడు కానీ చివరికి ఏ రాజకీయ నేత అయినా ప్రజలకు తలొగ్గక తప్పలేదు అని మరోసారి నిరూపించారు. ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యాడు ఏమో తెలియదు కానీ కెసిఆర్ మాత్రం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన జగన్ దీనిపై కమిటీ వేస్తున్నట్లు మాత్రమే చెప్పాడని ఆయన అన్నారు. కొద్ది నెలల్లో ఈ కమిటీ కాస్త ఇది కుదిరే పని కాదని తేల్చి చెప్పేస్తుంది అని... ఈ భూగోళం ఉన్నంతవరకూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది అసాధ్యమైన విషయం అని కేసీఆర్ తేల్చి చెప్పాడు. అయితే ఇప్పుడు కెసిఆర్ అన్న మాటల్ని జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నాడు. ఆర్టీసీ విలీనం ప్రక్రియను వేగవంతం చేసిన జగన్ ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా మరియు న్యాయశాఖ ల ఉన్నతాధికారులతో ఏడుగురు సభ్యుల వర్కింగ్ గ్రూప్ ను నియమించి అన్ని అంశాల్లో విధివిధానాలను ఖరారు చేయమని ఆదేశించాడు. నవంబర్ 15వ తేదీ లోపల ఈ వర్కింగ్ గ్రూప్ ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది.

జగన్ దూకుడు మరియు పట్టుదల చూస్తుంటే కచ్చితంగా గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైపోయేటట్లు ఉంది. అయితే అప్పుడు వస్తుంది కేసీఆర్ కు అసలైన తలనొప్పి. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్లను తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విరమించుకున్నారు. కనీసం ఇతర డిమాండ్లను అయినా పరిశీలించండి అన్న తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దిగి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఏపీలో పూర్తిస్థాయిలో ఆర్టీసీని విలీనం చేశారు అంటే మళ్లీ కథ అంతా మొదటికి వస్తుంది కేసీఆర్ కు కన్నీరే మిగులుతుంది. అప్పుడు ఏపీ లో ఉన్న పరిస్థితిని చూసి తెలంగాణా ఆర్టీసీ కార్మికులు కచ్చితంగా తమకు న్యాయం చేయాలని మంకుపట్టు కూర్చుంటారు. చూద్దాం కేసీఆర్ తలరాత ఎలా రాసిపెట్టి ఉందో.


మరింత సమాచారం తెలుసుకోండి: