ఈనెల 29వ తేదీన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏగా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం మంత్రులు  కొడాలినాని, పేర్నినానితో కలిసి ఎంఎల్ఏ జగన్మోహన్ రెడ్డితో భేటి అయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండే వంశీ వైసిపిలో చేరటం ఖాయమనే ప్రచారం మొదలైంది. తర్వాత మారిన పరిస్ధితుల్లో ఈనెల 29వ తేదీన ఎంఎల్ఏగా రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగిపోతోంది.

 

నిప్పులేందే పొగ రాదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే వంశీ రాజీనామా విషయమై ఇటు వైసిపితో పాటు అటు టిడిపిలో కూడా సంచలనంగా మారింది. మొత్తానికి వంశీ రాజీనామాతో చంద్రబాబునాయుడుకు షాక్ తగలటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే ఎంఎల్ఏకి చంద్రబాబుకు చాలా కాలంగా పెద్ద సఖ్యత అయితే లేదు.

 

అదే సమయంలో జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమతో కూడా అస్సలు పడదు. గడచిన ఐదేళ్ళుగా వంశీ-ఉమ మధ్య చాలా విషయాలపై గొడవలు జరిగాయి. అయితే ఆ గొడవలేవీ బయటపడకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్తపడింది. అందుకనే ఇద్దరిమధ్య గొడవలు నివురుగప్పిన నిప్పులాగ పెరుగుతునే ఉంది. అందులోను మొన్నటి ఎన్నికల్లో ఉమ ఓడిపోవటం, వంశీ గెలవటంతో గొడవలు మరింతగా పెరిగాయట.

 

ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నా చంద్రబాబు మాత్రం దేవినేనికే మద్దతు పలుకుతున్నారు. దాంతో చంద్రబాబుతో ఎంఎల్ఏకి బాగా గ్యాప్ పెరిగిపోయింది. దానివల్ల పార్టీలో ఇమడలేకపోతున్నారు. దాంతో పార్టీ కార్యక్రమాలకు కూడా వంశీ దూరంగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఎంఎల్ఏను బిజెపిలోకి లాక్కోవాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ప్రయత్నించారు. ఇదే విషయమై ఈ ఇద్దరిమధ్య ఈరోజే భేటి కూడా జరిగింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉదయం సుజనాతో భేటి అయిన ఎంఎల్ఏ మధ్యాహ్నానికల్లా జగన్ తో సమావేశమయ్యారు. నిజానికి వంశీ ఎప్పుడో వైసిపిలో చేరాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల టిడిపిలోనే కంటిన్యు అవుతున్నారు. ఈనెల 29న ఆ లాంఛనాన్ని పూర్తి చేస్తారని సమాచారం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: