వైసీపీలో జగన్ మాటే శాసనం. జగన్ ఎస్ అంటే ఎస్. నో అంటే నో. అది కదా పరిస్థితి. కానీ ఇపుడు వైసీపీలో కాంగ్రెస్ కల్చర్ కొంత కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చింది కదా వైసీపీ. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ స్వేచ్చ ఉంటుంది. ఎన్నో రకాలుగా వేదికలు ఉంటాయి. పరిస్థితి చేయి జారినా కూడా అదుపులో  ఉంచే మెకానిజం అక్కడ ఉంటుంది. ఇక్కడ జగన్ ఒక్కడే ఉంటాడు. జగన్ కన్ను పడిందంటే వరం. మూడవ కన్ను తెరిసే అదే శాపం.


మరి ఇన్ని తెలిసి కూడా నెల్లూరుకు చెందిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి  జగన్ సర్కార్ మీద ఇండైరెక్ట్ గా గళమెత్తారు. ఈ మధ్యనే జగన్ ఆదేశాల మీద అరెస్ట్ అయిన శ్రీధర్ రెడ్డి తన కోపం అలా ప్రదర్సిస్తున్నాన్నాడేమో చూడాలి. ఇంతవరకూ ఇసుక మీద  వైసీపీ సర్కార్లో ఎవరూ  గొంతెత్తి మాట్లాడింది లేదు. ప్రతిపక్షాలు మాత్రం అది ఆయుధంగా చేసుకుని ఆందోళన పేరిట రెచ్చిపోతున్నాయి. మరి ఇపుడు శ్రీధర్ రెడ్డి మాత్ర ఇసుక కొరతపై తానే పోరాటం చేస్తానని ప్రకటించి వైసీపీ హై కమాండ్ కి షాక్ తినిపించాడు. ఇసుక కొరత చాలా ఉందని ఆయన అంగీక‌రించడం ద్వారా విపక్షానికి ఆయుధాన్ని అందించాడు.


ఇక మరో విశేషం ఏంటంటే ఇసుక మాఫియా అన్న పదాన్ని కూడా శ్రీధర్ రెడ్డి వాడడం. నిజంగా ఈ పదం ఇపుడు ఎక్కువగా టీడీపీ, ఇతర పక్షాలు వాడుతున్నాయి. మరి  ఏపీలో ఇసుక మాఫియా ఉందని అన్న శ్రీధర్ రెడ్డి  ఆన్ లైన్లో ఇసుక ఇలా పెట్టి అలా అయిదు నిముషాల్లోనే నో స్టాక్ బోర్డ్ పెడుతున్నారని కూడా చెప్పడం బట్టి చూస్తే మొత్తంగా జగన్ సర్కార్ మీద దండెత్తినట్లుగానే ఉందని అంటున్నారు. మరి సొంతపార్టీలో ఈ నిరసన గళాన్ని ఓ సలహాగా భావిస్తారా లేక వేరే విధమైన షాక్  ట్రీట్మెంట్ ఇస్తారా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: