మే నెలలో ఏర్పాటు అయిన జగన్ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సమస్య పోలవరం డ్యాం నిర్మాణం, ఎన్నికల ప్రచారం లో   ఇచ్చిన హామీల లో అన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న జగన్ ప్రభుత్వానికి ఇది నిజంగా ఒక తీపి కబురు అని చెప్పాలి. చంద్రబాబునాయుడు గారు పోలవరం ఆగిపోయింది ఆగిపోయింది అని  ఎన్నిసార్లు అన్నారో ఆయనకే తెలుసు. అలాంటిది పోలవరం మీద జగన్ గారికి మరియు  congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఇది నిజంగా చాలా సంతోషకరమైన వార్త అనే చెప్పాలి .


పోలవరం ప్రాజెక్టుకు రూ.మూడు వేల కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ శుక్రవారం పంపిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. నవంబర్‌ మొదటి వారంలో నాబార్డ్‌ ద్వారా నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖకు సమాచారం ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.


పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చాక ఏప్రిల్‌ 1, 2014 నుంచి ఇప్పటిదాకా రూ.11,799.73 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయగా రూ.5,072.47 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. 


ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేయాలని ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన రూ.5,072.47 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ మరోసారి ప్రతిపాదనలు పంపింది.  కేంద్ర జల్‌శక్తి తొలి విడతగా రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపడంతో నిధుల విడుదలకు అడ్డంకులు తొలిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: