హుజూర్ నగర్ విజయం తెలంగాణా ముఖ్యమంత్రిలోని అహకారకారాన్ని అవధులు దాటించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. "ఆర్టీసీని ఈ భూమండలంలో ఎవరూ కాపాడలేరు? ఇక అది ముగిసిపోయిన చరిత్ర" ....ఆ స్వరం లోని కాఠిన్యం ఓటెసి టీఆరెస్ ను గెలిపించిన హుజూర్నగర్ వాసులకే ధిమ్మ తిరిగేలా చేసింది. కారణం గత దశాబ్ధాలుగా వేళ్ళూనుకున్న ఆర్టీసిని ఆ ఉద్యోగులను పూచిక పుల్లతో సమానంగా తీసేసిన కేసీఆర్ తీరు జనాల్ని అవాక్కుకు గురిచేసింది. హుజూర్ నగర్ విజయం నంద్యాలను గుర్తుచేస్తుంది – కేసీఆర్ పతనానికి ఇదే నాంది కానుందా? మయాబజార్ ప్రియదర్శినిలో భవిష్యత్ కనిపించినట్లు - హుజూర్ నగర్ విజయంలో కేసీఅర్ భవిష్యత్ కనిపిస్తుందా?
Image result for kcr Saidireddi in Huzurnagar
చూస్తుంటే నంద్యాల ఉప ఎన్నికల్లో అత్యంత భారి మెజారిటితో గెలిచిన తర్వాత నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆతరవాత పట్టిన గతే నేటి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడ పట్టబోతొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు.

ఇక కేసీఆర్ కూతురు కవిత ధారుణపరాభవంతో ఓడిపోతే ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఒక ప్రెస్‌నోట్ కూడ విడుదల చేయలేదని, ముగ్గురు ఎమ్మెల్సిలు ఓడిపోయిన సమయంలో కూడ ప్రెస్-మీట్ పెట్టలేని కేసీఆర్ ఉపఎన్నికల్లో గెలిచిన గంటసేపటికే మీడీయా సమావేశం నిర్వహించారని విమర్శించారు.
Image result for kcr on rtc strike
ఇలాంటి ఉప ఎన్నికలను ఎన్నింటినో దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అనుభవంలో చూశాయని అన్నారు. ఇక ఆర్టీసీ సమ్మెకు హుజుర్‌నగర్ ఎన్నికల ఫలితానికి అసలు సంబంధం ఏమిటి? అని లక్ష్మణ్  ప్రశ్నించారు.

హుజుర్‌ నగర్‌ ఎన్నికల్లో గెలించేందుకు కులానికి, మతానికి ప్రాంతాల ప్రాతిపదికన మంత్రులను, లు ఇతర నాయకులను ఎంపిక చేసి కోట్లాది రుపాయిలను ఖర్చు పెట్టారని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాజకీయాలు ఏవైనా ఉంటే రాజకీయ పార్టీల పరంగా చూసుకోవాలి గాని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఆర్టీసీ కార్మికుల మీద కక్ష పెంచుకోవడం, వారిపై అనరాని మాటలు, పలకలేని తిట్లు, అహంకారపూరిత ప్రసంగాలు చేయటం మంచిది కాదని ఆయన అన్నారు.
Image result for kcr on rtc strike
ఆర్టీసి కార్మికులకు రెండులక్షల రూపాయిలు బోనస్ తీసుకునే భవిష్యత్ ఉందని కేసీఆర్ అనటంలోనే - టిఎస్ ఆర్టీసిని ప్రయివేట్ పాల్జేసి తన బంధు వర్గానికో కులవర్గాని కో మిత్రవర్గానికో కట్టిపెట్టే కేసీఆర్ ఆలొచనను ప్రజలు వ్యక్త పరుస్తున్నారు. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసిన సీఎం కేసీఆర్ మనసులోని భావాలు ఇలా బహిర్గతమౌతున్నాయని అంటున్నారు. కేసీఆర్ పాపం! పండటానికే హుజూర్ నగర్ ప్రజ ఈ గెలుపునిచ్చిందని - రానున్న ఈ చంద్రుని (కేసీఆర్) భవిష్యత్  గతించి పోయిన ఆ చంద్రుని (చంద్రబాబు) పతనం — గుర్తు చేస్తుందని అంటున్నారు.

అందుకే బీజేపీ ఉద్యమబాట పట్టిందని, 20 రోజులుగా కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఇక కేసీఆర్ రెచ్చగొట్టే మాటలకు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. భవిష్యత్‌లో కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ కోసం చిత్ర ఫలితం
నంద్యాల ఉపేన్నిక విజయం దరిమిలా చంద్రబాబు ఉపయోగించిన పదజాలమే ఆయన పతనానికి పునాదులు వేస్తూవచ్చిందని, ప్రస్తుతం ఈ గెలుపు టీఆరెస్ కు ఇచ్చిన తెలంగాణా ప్రజలు బహుశ కేసీఆర్ కు రానున్న కాలం మరింత గడ్డుకాలంగా మార్చనున్నారని - జనాంతికంగా వినిపిస్తున్న మాటలు.

Image result for kcr on rtc strike

మరింత సమాచారం తెలుసుకోండి: