ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీపావళి కళ తప్పిన వేళ.. భారీ బోనస్‌లతో సింగరేణి కార్మికుల ఇంట పండుగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం బోనస్‌ల రూపంలో ఒక్కో కార్మికుడికి లక్ష రూపాయలకు పైగా అందించడమే. ఇక కార్మికుల ఇంట దీపావళి ఆనందం వెల్లివిరుస్తోంది. ఇకపోతే దసరా పండగ ముందు  కార్మికులకు, ఉద్యోగులకు ఈ బోనస్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ మద్యకాలంలో సింగరేణి సంస్థ రూ.494 కోట్ల లాభాలను కార్మికులకు బోనస్‌గా పంపిణీ చేసింది.. తాజాగా పంపిణీ చేసిన బోనస్‌తో కలుపుకొని కార్మికులకు ఒక్కొక్కరికి ఈ ఏడాది లక్ష రూపాయలకు పైగా పంపిణీ చేసినట్లైంది.


దీనికి అదనంగా కొంత మంది కార్మికులకు అడ్వాన్స్ సాలరీలు చెల్లించారు. ఇది కూడా కలుపుకుంటే.. కొంతమంది కార్మికులు రూ.లక్షన్నరకు పైగా బోనస్ పొందారు.. ఇకపోతే శుక్రవారం (అక్టోబర్ 25) సింగరేణి కార్మికులకు కంపెనీ యాజమాన్యం దీపావళి బోనస్ పంపిణీ చేసింది. కార్మికులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.64,700 చొప్పున బోనస్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇక కార్మికులకోసం సింగరేణి యాజమాన్యం దీపావళి బోనస్ కింద మొత్తం రూ.258 కోట్లు విడుదల చేసింది. ఇక ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు దసరా కానుకగా బోనస్ అందించడం ఆనవాయితీగా వస్తోంది.


గతేడాది రూ.60,500/- బోనస్ ఇవ్వగా.. ఈసారి మరింత పెంచడం గమనార్హం. ఈ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.64,700 బోనస్ పంపిణీ చేశారు. 2016లో రూ.54 వేలు, 2017లో రూ.57 వేలు బోనస్‌గా అందించారు. ఇకపోతే ఈ సంవత్సరం అందించిన బోనస్ సింగరేణి చరిత్రలో ఇదే అత్యధిక కావడం గమనార్హం. అంతే కాకుండా దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు చెల్లించిన అత్యధిక బోనస్ కూడా ఇదేనని తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి కార్మికుల బోనస్ ఏకంగా 209 శాతం పెరగడం విశేషం. బోనస్ డబ్బుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ కార్మికులకు సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: