దుష్యంత్ చౌతాలా ఇప్పుడు ఈ పేరు ఇండియన్ పాలిటిక్స్ లో ఒక సంచలనం. ఇప్పుడు హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇతను వయసు కేవలం 31 ఏళ్ళు. కాంగ్రెస్  బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు కింగ్ మేకర్ గా మారినాడు. కానీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలవకలేపోయారు. పవన్ కు సినిమా ఇమేజ్ ఉండి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జగన్ నే టార్గెట్ చేయడంతో పవన్ టీడీపీ మనిషి మాదిరిగా ముద్ర పడిపోయారు. దీనితో జనాలకు పవన్ మీద నమ్మకం కుదరలేదు. కానీ దుష్యంత్ చౌతాలా అలా కాదు ఇటు బీజేపీని .. కాంగ్రెస్ ను చీల్చి చెండాడినాడు. దీనితో ప్రజలు అతని మీద నమ్మకం పెట్టుకున్నారు. 


కానీ పవన్ కళ్యాణ్ పూర్తి రాంగ్ ట్రాక్ లో వెళుతున్నాడని క్లియర్ గా చెప్పాలి. చంద్రబాబు మీద ఈగ కూడా వాలకుండా పవన్ చేస్తున్న రాజకీయాలు తెలుగు ప్రజలు అర్ధం చేసుకున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ పొద్దున్న నుంచి ఇదే మాదిరిగా జగన్ కేసుల గురించి ప్రస్తావిస్తూ వచ్చింది. కానీ జనాలు టీడీపీకి బుద్ధి చెప్పి జగన్ ను గెలిపించారు. జగన్ మీద ఇప్పటి వరకు కనీసం ఒక్క కేసు కూడా నిలబడిన ధాఖలు లేవు. అలాంటింది జగన్ కేసుల గురించి ఎందుకు భయపడతారు. ఒక వేళ జగన్ కేసులకు భయపడితే ఇన్నేళ్లు ప్రత్యేక హోదా అంటూ కేంద్రం మీద యుద్ధం ఎందుకు ప్రకటిస్తారు. నిజంగా జగన్ కేంద్రంతో లాలూచి పడి ఉంటే .. సీబీఐ జగన్ కు కోర్ట్ హాజరు నుంచి మినహాయింపు ఎందుకు ఇవ్వదు. కానీ ఇవేమి పవన్ మేధావికి అవసరం లేదు. 


జగన్ మీద కేసులు ఉంటే వాటిని కోర్టులు తెలుస్తాయి. ఇప్పటి వరకు జగన్ కేసుల్లో ఉన్నవి ఆరోపణలు మాత్రమే .. ఇంకా నిర్దారణ కాలేదు. కానీ పవన్ మాత్రం జగన్ కేసులు గురించి పదే పదే ప్రస్తావించి జనాల్లో చులకన అవుతున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ కూడా ఇదే మాదిరిగా ఆరోపణలు చేసింది. కానీ జనాలు అవేమి పట్టించుకోకుండా భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ పాలన పట్ల విమర్శలు చేస్తే ఎవరు తప్పు పట్టరు. కానీ ఇంకా జగన్ మీద నిర్ధారణ కాని కేసుల గురించి పవన్ మాట్లాడటం మెజారిటీ జనాల్లో కోపం తెప్పిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: