తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హిందూపురంలో అవమానం జరిగింది. బాలకృష్ణ తనకు ఎస్కార్ట్ సౌకర్యం కల్పించాలని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మూడు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు బాలకృష్ణకు ఎస్కార్ట్ సౌకర్యం కల్పించలేదు. పోలీసులు ఎస్కార్ట్ సౌకర్యం కల్పించకపోవటంతో చివరకు బాలకృష్ణ ఒక్కరే సొంత వాహనంలో బెంగళూరుకు బయలుదేరారు. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులు ప్రోటోకాల్ పాటించటం లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు రక్షణ కల్పించలేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ నిన్న ఉదయం మొదట అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం తరువాత ఎస్కార్ట్ సౌకర్యం కావాలని మూడు పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. పోలీసుల నుండి తగిన స్పందన లేకపోవటంతో 30 నిమిషాల తరువాత బాలకృష్ణ బెంగళూరుకు బయలుదేరారని సమాచారం. 
 
పోలీసులు ఎమ్మెల్యే బాలకృష్ణకు తగిన భద్రత కల్పించకపోవటం పట్ల బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా పోలీసులు ప్రోటోకాల్ పాటించాల్సిందే అని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలతో ప్రోటోకాల్ పాటించేదని చెబుతున్నారు. 
 
ఎమ్మెల్యే బాలకృష్ణ బెంగళూరు వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక్కరినే పంపించడం చాలా హేయమైన చర్య అని టీడీపీ నేతలు చెబుతున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యే మాత్రమే కాదని ఒక సెలబ్రిటీ అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలని పోలీసులు ఎందుకు భద్రత కల్పించటం లేదని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ విషయంలో పోలీసులు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని ప్రశిస్తూ పోలీసులు బాలకృష్ణను అవమానపరిచారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: