సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. తొందరలోనే రాజకీయాల నుండి తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొడుకు హితేష్ చెంచురామ్ కోసమే దగ్గుబాటి చాలాకాలం తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.  అయితే అనుకున్నదొకటైతే జరిగిందొకటి. దాంతో మొన్నటి ఎన్నికల్లో కొడుకు బదులు పర్చూరు నియోజకవర్గంలో తానే పోటి చేసి ఓడిపోయారు.

 

వైసిపి అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో దగ్గుబాటికి సమస్య మొదలైంది. భార్య పురంధేశ్వరి బిజెపిలో ఉంటూ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్న నేపధ్యంలో దగ్గుబాటికి  అధికార పార్టీలో ఇబ్బందులు మొదలయ్యాయి. భార్యా, భర్తలు చెరో పార్టీలో ఉన్న కారణంగా పురంధేశ్వరి విమర్శలను వైసిపి నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోతేన్నారు.

 

ఇదే విషయాన్ని మాజీ మంత్రితో భేటి అయినపుడు జగన్ ప్రస్తావించారు. దగ్గుబాటి వైసిపిలో ఉండదలచుకుంటే భార్యను కూడా పార్టీలోకి తీసుకురావాలి. లేకపోతే ఏమి చేయాలో నిర్ణయించుకోమని దగ్గుబాటికే చాయిస్ వదిలేశారు జగన్. ఈ నేపధ్యంలోనే అమెరికా నుండి తిరిగివచ్చిన భార్యతో దగ్గుబాటి కుటుంబం మొత్తం చాలాసేపు చర్చలు జరిపారు. దగ్గుబాటి ఎంతచెప్పినా తాను మాత్రం బిజెపిని వదిలిపెట్టి బయటకు వచ్చేది లేదని భార్య తెగేసి చెప్పినట్లు సమాచారం.

 

భార్య నిర్ణయం విన్న తర్వాత వేరేదారిలేక చివరకు దగ్గుబాటే వెనక్కు తగ్గాలని డిసైడ్ అయ్యారట. అందుకనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అదే సమయంలో కొడుకు హితేష్ భవిష్యత్తు విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. నిజానికి మొన్నటి ఎన్నికల్లో హితేషే పోటి చేయాల్సింది. కానీ అమెరికా పౌరసత్యం రద్దుకాక పోవటంతో చివరకు దగ్గుబాటే పోటి చేయాల్సొచ్చింది. సరే రిజల్ట్ ఏదైనా తాజాగా ఎదురైన సమస్యతో చివరకు రాజకీయాలకే గుడ్ బై చెప్పేయాలన్నది కీలక నిర్ణయమే. ఇదే విషయాన్ని ఈరోజు అంటే శనివారం తన మద్దతుదారులతో సమావేశమై ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: