రీల్ లైఫ్ లో హీరో అయిన పవన్ కళ్యాణ్, రియల్ లైఫ్ లో కూడా ఏపీ ప్రజల్లో హీరో అవ్వాలని తహతహలాడాడు. ఎన్నికలు జరగక ముందే తన వ్యూహాత్మక తప్పిదాలంతో తానొక ఆవేశ పరుడనే కీర్తిని, చంద్రబాబుకి షాడో గా వ్యవహరిస్తున్నారనే అనుమానాన్ని ప్రజలలో మూటగట్టుకుని మోయలేని భారంతో ఎన్నికల్లో చతికల పడ్డాడు. రాజకీయాలు అంటే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం కాదు, పతిపక్షం అయినా సరే ప్రభుత్వం మంచి పని చేసినపుడు సమర్ధించాలి,  తప్పు చేస్తే ఖండిచాలి అంటూ లెక్చర్లు మీద లెక్చర్లు ఇచ్చాడు జనసేనాని..కట్ చేస్తే..

 

జగన్ పాలన ఎంతో అద్భుతంగా ఉందని, పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ఏపీ ప్రజలు జగన్ పాలనకి  ఫిదా అవుతుంటే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఏపీ ప్రజలని పక్కదారి పట్టించేలా జగన్  ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం చర్చనీయాసం అవుతోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చక పొతే అదిగో జగన్ మాట ఇచ్చి తప్పాడు అంటూ విమర్శలు చేస్తారు, అమలు చేస్తున్నా జగన్ పై విమర్శలు చేస్తున్నారంటూ జనసేనాపై మండిపడుతున్నారు ఏపీ జనం. ఇదిలాఉంటే

 

తాజాగా జనసేన పార్టీ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై సర్వాత్రా విమర్శలు వస్తున్నాయి. జనసేన ఆవిర్భావం తరువాత అవలంభించిన ధోరణికి, ప్రస్తుత ధోరణికి అసలు పోలికే లేదంటూ జనం కామెంట్స్ చేస్తున్నారు. తెనాలిలో ఓ తాపీ మేస్త్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంతవరకూ సమంజసం అంటూ ఫైర్ అవుతున్నారు. ఒక వ్యక్తి చనిపోవడం బాధాకరమే అది ఎవరూ ఆమోదించతగ్గ విషయం కాదు, కానీ టీడీపీ మాదిరిగా ఒక వ్యక్తి మరణాన్ని రాజకీయ మైలేజ్ కోసం జనసేన వాడుకోవడంతో  జనసేన కూడా  టీడీపీ మాదిరిగానే శవ రాజకీయాలు మొదలు పెట్టిందా అంటూ ఏపీ ప్రజలు విస్తుపోతున్నారు.

 

జనసేనలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని ఊహించిన నేతలు ఒక్కొక్కరిగా జారుకోవడంతో పవన్ కళ్యాణ్ కి దిక్కుతోచడంలేదని, ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ జనం మెచ్చిన పధకాలు  జగన్ అమలు చేస్తున్నా కనపడనట్టు ఉంటున్న జనసేన పార్టీ , ఓర్వలేక చివరికి  శవ రాజకీయాలకి దిగిపోయిందని, దీన్ని బట్టి ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని లెక్కలేస్తున్నారు. ఏది ఏమైనా జనసేన పార్టీ టీడీపీ బాటలో నడుస్తోందని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదనేది ఏపీ  ప్రజల మనోగతం..  

 

  


మరింత సమాచారం తెలుసుకోండి: