తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం  ఏర్పడినప్పటి నుంచి సింగరేణి కార్మికుల బతుకులు మారుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... సింగరేణి మరింత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణకు నిధుల గని గా  ఉన్న బొగ్గుల గని  సింగరేణి ... తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చటంలో  ముఖ్య భూమిక పోషిస్తుంది . ప్రతి సంవత్సరానికి సింగరేణి బొగ్గు గనుల వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతుంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం సింగరేణి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. కార్మికులను ప్రోత్సహించడం తో పాటు ఉద్యోగ భద్రతను కూడా కల్పించింది ప్రభుత్వం. 



 ఈ నేపథ్యంలో సింగరేణి కి వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటాను ఇచ్చి... కార్మికులను  ప్రోత్సహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే సింగరేణి కార్మికులకు  ప్రోత్సాహకాలను తెలంగాణ   ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇప్పటికే దసరా పండుగ ముందు సింగరేణి యాజమాన్యం ప్రతి సింగరేణి కార్మికులు ఉద్యోగులకు... సింగరేణి లాభాల్లో వాటా కల్పిస్తూ... 494 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన బోనస్ తో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా  సింగరేణి కార్మికులకు సింగరేణి లాభాలలో వాటా కల్పిస్తూ అధిక మొత్తంలో బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది.



 ఇదిలా ఉండగా తాజాగా దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులు ఉద్యోగులకు మరోసారి బంపర్ బొనంజా ప్రకటించింది  ప్రభుత్వం. తాజాగా దసరా పండుగ సందర్భంగా 40 వేలకు పైగా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం... దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులు ఉద్యోగులకు ఒక్కొక్కరికి 64, 700 రూపాయలను  పంపిణీ చేసింది. ఈ మొత్తాన్ని కార్మికులు ఉద్యోగుల ఖాతాలో జమ చేసింది సింగరేణి యాజమాన్యం. అయితే దీపావళి సందర్భంగా కార్మికులు ఉద్యోగులకు ఒక్కొక్కరికి బోనస్ పంపిణీ చేసేందుకు 258 కోట్లు విడుదల చేసింది  సింగరేణి యాజమాన్యం. అయితే దసరా దీపావళి బోనస్ లు కలుపుకుంటే ఏకంగా లక్ష రూపాయల బోనస్ కార్మికులు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే దేశంలోనే ఓ ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులకు చెల్లించిన అత్యధిక బోనస్ ...తెలంగాణ  ప్రభుత్వం సింగరేణి కార్మికులు ఉద్యోగులకు చెల్లించినదే కావడం గమనార్హం. అయితే ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి కార్మికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన బోనస్సుతో  ఈ దీపావళికి సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండినట్లయింది .


మరింత సమాచారం తెలుసుకోండి: