సుజనా చౌదరి ప్రత్యక్ష రాజకీయాలకు ఎపుడూ సంబంధం లేని మనిషి. ఆయన రాజ్యసభ సభ్యుడుగానే ఉన్నారు, ఉంటున్నారు. తెలుగుదేశం అధినేతకు దగ్గరగా ఉంటూ ఆ పార్టీకి ప్రధాన ఆర్ధికవనరుగా ఉన్నారని  కూడా అప్పట్లో ప్రచారంలో ఉంది. అయితే ఆయన్ని తన సన్నిహితుడు కాబట్టే బాబు మోడీతో మాట్లాడి మరీ  కేంద్ర మంత్రిని చేశారు. క్యాబినెట్ ర్యాంక్ తో పాటు, సీనియర్ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజుని పక్కన పెట్టి మరీ సహాయమంత్రిగా ఉన్న సుజనతోనే బాబు అప్పట్లో కధ నడిపించారని కూడా అంటారు.


ఇపుడు ఆ రుణం సుజనా చౌదరి తీర్చుకుంటున్నారా అన్నట్లుగా  ఉంది. ఒంగోలులో మాట్లాడుతూ సుజనా చేసినా కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని అంటున్నారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఫెయిల్ అవడం వల్ల అన్న నందమూరి ప్రాంతీయ పార్టీని పెట్టారాని చెప్పిన సుజనా చౌదరి చంద్రబాబు 1995 నుంచి  2004 వరకూ  అద్భుతమైన పాలన అందించారని బీజేపీ నేతగా కితాబు ఇస్తున్నారు. వైఎస్సార్ హయాంలో కుటుంబ పాలన మొదలైందని ఇప్పటికి పలుమార్లు సుజన చౌదరి అన్నారు. వైఎస్సార్ ప్రాంతీయ పార్టీ నాయకుడు కాదు, ఆయన జాతీయ పార్టీ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు ఆయన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు, తమ్ముడు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఇక 2009 ఎన్నికల్లో మాత్రం జగన్ ఎంపీ అయ్యారు. వారంతా జాతీయ పార్టీలో ఉన్న సంగతి కావాలనే విస్మరించి బురద జల్లుతున్నారని  వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.


ఇక చంద్రబాబుది కుటుంబ పాలన అని అనడానికి ఆధారాలు ఉన్నాయి. తన కుమారుడు లోకేష్ ని మంత్రిగా చేసి ఎమ్మెల్సీగా చేసిన ఘనత బాబుదే. దాన్ని తప్పుపట్టాల్సిన సుజనా జగన్ని కూడా అందులోకి లాగుతున్న్నారు. జగన్ కుటుంబ పాలన ఎక్కడిది. ఆయన ఒక్కరే సీఎం గా ఉన్నారు. ఇక జగన్ వైసీపీకి, వైఎస్సార్ కి సంబంధం కూడా లేదు. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. మరి ఇందులో కుటుంబ పాలన ఎక్కడ కనిపించిందో సుజనా లాంటి మేధావికి తెలియాలి. ఆయన మరో మాట అంటున్నారు. ప్రాతీయ పార్టీల కాలం అయిపోయిందని. తాజాగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రాతీయ పార్టీలే మంచి సీట్లు సాధించి జెండా ఎగరెస్తున్నాయి. ఆ సంగతి మరచి అవుట్ డేటెడ్ పాలిటిక్స్ సుజనా మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుకోరా మరి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: