తమిళనాడులో 2సంవత్సరాల బాలుడు సుజీత్ బోరుబావిలో పడ్డాడు. తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టి గ్రామంలో నిన్న సాయంతం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 15 గంటల నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుజీత్ అనే బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ పాత బోరుబావిలో పడిపోయాడు. సుజీత్ కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వటంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఫైర్ సేఫ్టీ మరియు రెవిన్యూ అధికారులు బాలుడిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాలుడు ప్రస్తుతం 40 అడుగుల లోతులో ఉన్నాడని అధికారులు గుర్తించారు. ప్రత్యేకమైన ట్యూబ్ సహాయంతో చిన్నారి సుజీత్ కు ఆక్సిజన్ పంపుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో అధికారులు టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. 
 
ప్రత్యేక పరికరాల ద్వారా చిన్నారి సుజీత్ పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వుతున్నారు. వర్షం కారణంగా సహాయకచర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. అధికారులు చిన్నారి సుజీత్ కు అపాయం లేదని చెబుతున్నారు. మరికొద్ది గంటల పాటు సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉందని, బాలుడు బయటకు క్షేమంగా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు 
 
సహాయక చర్యలలో ఏన్డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ శివరాసు, పర్యావరణ మంత్రి నటరాజన్, ఎస్పీ జౌల్ హక్ కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా #prayforsujith #savesujith పేరుతో నెటిజన్లు బాలుడిని క్షేమంగా కాపాడాలని ట్వీట్లు చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుండి రెస్క్యూ టీమ్ చిన్నారి సుజీత్ ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఒక ప్రత్యేకమైన రోబోట్ సహకారంతో తమిళనాడు పోలీసులు చిన్నారి సుజీత్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారని కానీ ఆ  ప్రయత్నాలు విఫలం కావటంతో సాధారణ పద్ధతుల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారని సమాచారం. 



 
 




మరింత సమాచారం తెలుసుకోండి: