హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు నరకాసురుడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారు. రామాయణం ప్రకారం లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు వచ్చిన సమయంలో ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకున్నారు. 
 
ఈ సంవత్సరం దీపావళి పండుగ రేపా? ఎల్లుండా? అనే సందిగ్ధం ప్రజల్లో నెలకొంది. కొందరు పండుగ ఆదివారం జరుపుకోవాలని చెబుతుంటే మరికొందరు మాత్రం సోమవారం రోజు పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సోమవారం రోజున దీపావళి పండుగ సెలవుగా ప్రకటించింది. హైకోర్టు కూడా సోమవారం రోజును సెలవుగా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ముందుగా 27వ తేదీని సెలవుగా ప్రకటించినా ప్రస్తుతం సెలవును మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. 
 
చతుర్థశి ఘడియలు రేపు మధ్యాహ్నం నుండి వస్తాయి కాబట్టి దీపావళి పండుగ సోమవారం రోజు జరుపుకోవాలని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈరోజు సెలవుపై నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నంలోపు ఏపీలో దీపావళి పండుగ సెలవు గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చీకటి పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా మరియు విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. 
 
దీపావళి పండుగ ప్రతి సంవత్సరం అశ్వీయుజ అమవాస్యరోజున వస్తుంది. దీపావళి పండుగ ముందురోజు అశ్వీయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చటం వలన ఆ వెలుగులో, శబ్ద తరంగాలలో దారిద్ర్యం, బాధలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పురాణాలలో ఉంది. కొన్ని ప్రాంతాలలో దీపావళి పండుగను అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఉత్తరాది వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: