క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అదే అనుమానంగా ఉంది. సమైక్య రాష్ట్రంలో కానీ ఇపుడు కానీ తెలుగుదేశంపార్టీ అంటే కమ్మోళ్ళ పార్టీ అనే ముద్ర బలంగా పడిపోయింది. ఎన్టీయార్ చేతిలో పగ్గాలున్నంత వరకూ పార్టీపై లేని ముద్ర చంద్రబాబునాయుడు చేతిలోకి రాగానే పడిపోయింది. మొన్నటి ఐదేళ్ళ పరిపాలనలో అయితే మరీ అన్యాయంగా తయారైంది పార్టీ.

 

ఇలాంటి నేపధ్యంలో మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత సుజనా చౌదరి లాంటి కమ్మ పారిశ్రామికవేత్తలు బిజెపిలోకి ఫిరాయించారు. ముందుజాగ్రత్తగా చంద్రబాబు నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపారనే ప్రచారం కూడా అందిరికి తెలిసిందే. సరే ఫిరాయింపులు ఎలాగున్నా సుజనా మాత్రం యాక్టివ్ అయినట్లే కనిపిస్తోంది.

 

తెలుగుదేశంపార్టిలోని నేతల్లో వీలైనంతమందిని బిజెపిలోకి తీసుకొచ్చే టార్గెట్ పెట్టినట్లుంది పార్టీ అగ్రనాయకత్వం సుజనాపై. అందుకనే ముందుగా టిడిపిలోని తన సొంత సామాజికవర్గం నేతలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీతో చాలాసేపు భేటి అయ్యారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ సాయంత్రానికి ఎంఎల్ఏ జగన్మోహన్ రెడ్డితో కూడా భేటి అయ్యారు.

 

వంశీతో భేటి తర్వాత సుజనా ప్రకాశం జిల్లాలోని చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ తో కూడా సుదీర్ఘ భేటి జరిపారు. దీని పర్యవసానం తొందరలోనే తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితం బాపట్లకు చెందిన ఎంఎల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తో భేటి జరిపారు. తర్వాత కొద్దిరోజులకే సతీష్ బిజెపిలో చేరారు.

 

అంతకుమందు అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి కూడా సుజనాతో భేటి తర్వాత బిజెపిలో చేరారు. గుంటూరు జిల్లాలోని సీనియర్ నేత చందు సాంబశివరావు కూడా సుజనాతో సమావేశం తర్వాతే బిజెపిలో చేరారు. సుజనా వరస చూస్తుంటే టిడిపిలోని కమ్మ నేతల్లో వీలైనంతమందిని బిజెపిలో చేర్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైపోతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: