ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సొమ్ముని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి అయన తనయుడు పూర్తిగా వ్యక్తిగతంగా ఉపయోగించారు. కొడుకు తిండికి 25 లక్షల రూపాయిల బిల్ వచ్చింది. తండ్రి ఒకే ఒక్క రోజు ధర్మ పోరాటానికి 10 కోట్లు ఖర్చు వచ్చింది. అసలు రాష్ట్రా డబ్బుని 5 ఏళ్లలో పూర్తిగా దుర్వినియోగం చేసి చివరికి అప్పులపాలైన రాష్ట్రాన్ని కొత్త ప్రభుత్వం చేతిలో పెట్టారు. 


అసలు ఏంటి అనుకుంటున్నారా ? అదే చెప్తున్నా అండి. వివరాల్లోకి వెళ్తే..  ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక్కరోజు 'ధర్మపోరాట దీక్ష' చేశాడు. ఆ ఒక్క రోజు ధర్మ పోరాటానికి 10 కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 


ఇంత ఖర్చు చేయడంపై వేటుకూరి ఏవీఎస్‌ సూర్య నారాయణ రాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ''ఈ ధర్మ పోరాటం కేవలం అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేపట్టిన దీక్ష అని, ఇందుకు ప్రజా ధనాన్ని వినియోగించడం సరి కాదని పేర్కొన్నారు.


దీంతో ఆ పది కోట్ల రూపాయల్ని కేటాయిస్తూ జీవో విడుదల చేసిన అధికారి ఎవరు? ఏ నిబంధనల మేరకు జీవో విడుదల చేశారని కోర్టు నిలదీసింది. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాకు ఇంత భారీ స్థాయిలో ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.


దీంతో నెటిజన్లు అంత చంద్రబాబు.. అతని తనయుడి నారా లోకేష్ పై ఫైర్ అవుతున్నారు. కొడుకు కేవలం చిరుతిండికే 25 లక్షలు ఖర్చు చేశాడు.. తండ్రి ఒక్కరోజు ధర్మ పోరాటానికి 10 కోట్లు ఖర్చు చేశారు.. ఎం మనుషులు రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్కరోజు ధర్మ పోరాటానికి 10 కోట్లు ఖర్చు ఏంటండీ ?    


మరింత సమాచారం తెలుసుకోండి: