చంద్రబాబునాయుడుకు తన స్థానం ఏంటో తెలిసిరానుందా. దారుణమైన పరాజయం  పాలు అయినా కూడా బాబులో రాలేదని వైసీపీ నేతలు అంటున్నారు.   ఇక  ప్రతి రోజూ  జగన్ని చీల్చిచెండాడుతూ తన అనుకూల మీడియా అండతో రెచ్చిపోతున్న తీరుకు దెబ్బ పడిపోనుందా. ఏపీ రాజకీయాల్లో కీలకమైన సన్నివేశాలకు తెర లేవనుందా. ఏపీలో ప్రతిపక్షం ఉండదా. బాబుకు ఆ విధంగా గట్టి హెచ్చరికలే జగన్ పంపుతారా..వీటిని సమాధానం కొద్ది రోజుల్లోనే దొరకనుందిట.


ఏపీలో చంద్రబాబు జగన్ మీద పూర్తిగా వ్యక్తిగత  దాడికి దిగుతున్నారు. కనీసం ఆయన కొంతకాలం టైం కూడా ఇవ్వకుండా వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. దీంతో జగన్ కే కాదు, ఆయన మంత్రులకూ, మొత్తం పార్టీకి ఇది చికాకుగా మారిందంట. తాను ప్రతిపక్ష నాయకుడిని అన్న భావంతో చంద్రబాబు జగన్ మీద వేలు చూపించి మరీ దబాయిస్తున్నారు. వీధి పోరాటాలకు సిధ్ధపడుతున్నారు.


ఇక అసెంబ్లీలో బాబుకు ఒక చాంబర్, ఆయా పార్టీకి మరో చాంబర్ ఇలా ఎంజాయ్ చేస్తున్న బాబు గట్టిగా అయిదు నెలల జగన్ పాలన ముగియకముందే నేనే ఏపీకి సీఎం అంటున్నారు. దాంతో జగన్ కి మండిపోతోందని  టాక్. బాబు ఎమ్మెల్యేలను తీసుకోవద్దని గట్టి సంకల్పంతో ఉన్న జగన్ ఇపుడు బాబు రెచ్చగొట్టుడు వైఖరి చూసి తానూ మారాలనుకుంటున్నారుట. తన ఒట్టు తీసి గట్టున పెడుతున్నారుట. తాను  కనుక గేట్లు తెరిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా బాబు వైపు ఉండరని జగన్ తొలి సమావేశాల్లోనే చెప్పారు, ఇపుడు అదే చేయాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారుట.


 దానికి ఆరంభంగా విజయవాడకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్ గూటికి వచ్చేశారు. కనీసంగా 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసెపీ వైపు చూస్తున్నారుట. మరికొందరు ఎమ్మెల్యేలు కనుక చేరితే  వైసీపీలో  విలీనం చేసుకోవడం ద్వారా టీడీపీకి, చంద్రబాబుకు ఆయన  రాజకీయ చరిత్రలోనే  మరచిపోలేని గుణపాఠం చెప్పడానికి జగన్ రెడీ అవుతున్నారని అంటున్నారు. అదే జరిగితే చంద్రబాబు విపక్ష నేత పదవి గోవిందా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: