యువత బలహీనతలను క్యాష్ చేసుకున్న ఓ హనీ ట్రాప్ టీమ్ అమ్మాయిలను ఎర చూపి విశాఖ అబ్బాయిలను నిలువునా మోసం చేసింది. కోల్ కతాలో ఓస్లా ఐటీ సర్వీసెస్ కంపెనీ ముసుగుల ఈ దందా నిర్వహిస్తోంది ఓ గ్యాంగ్. వీరంతా ఫేక్ డేటింగ్ వెబ్ సైట్లను క్రియేట్ చేసి అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి యువత నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరి మాయ మాటలకు పడిపోయిన విశాఖ యువకులు వారికి లక్షల్లో డబ్బు ధారపోశారు. 

 

 

మోసపోయామని గుర్తించిన అబ్బాయిలు విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులకు పెద్ద టీమ్ దొరికింది. ఈ బృందంలో మొత్తం 24 మంది యువతులు ఉన్నట్టు వీరంతా కోల్ కతా అమ్మాయిలే అని గుర్తించారు. దీంతో పశ్చిమ్ బెంగాల్ వెళ్లి వారిని అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచిన అనంతరం పీటీ వారెంట్ పై వీరందరినీ విశాఖ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీరి నుంచి 3 ల్యాప్ టాప్ లు, 40 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశేషమేమంటే.. అబ్బాయిలను మనీ ట్రాప్ లోకి దింపేందుకు ఈ అమ్మాయిలకు ఈ టీమ్ ను నడిపిస్తున్న గ్యాంగ్ ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎంత వయ్యారంగా మాట్లాడాలి, వారిని ముగ్గులోకి ఎలా దించాలి, నగదు ఎలా సంపాదించాలి అనేదానిపై కోచింగ్ సెంటర్ లా వీరికి వయ్యారపు పాఠాలు నేర్పిస్తున్నారు. 

 

 

కోల్ కతా కేంద్రంగా జరుగుతున్న మనీట్రాప్ కేసు సంచలనం రేకెత్తిస్తోంది. ఈ టీమ్ లో మరెంతమంది ఉన్నారో, బాధితులు ఎంతమంది ఉన్నారో పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం 24 మంది టెలీకాలర్స్ తోపాటు.. మొత్తం 27 మందిని కోల్ కతాలోని బెహలా పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో తెలియని వారితో చేసే చాటింగ్ ఎంత నష్టమో ప్రస్తుత సంఘటన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: