ట్విన్ సిటీస్ లోని యువత గంజాయి బాట పట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు నిజామాబాద్ లో కూడా గంజాయి మత్తుకు బానిసలవుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి జంట నగరాలకు భారీ ఎత్తున గంజాయి సరఫరా అవుతోంది. పోలీసులు గంజాయి స్మగ్లర్లను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నా జంట నగరాల్లో గంజాయి సరఫరా మాత్రం ఆగటం లేదు. 
 
కార్పొరేట్ కాలేజీలలోని స్టూడెంట్స్ ముఖ్యంగా డ్రగ్స్ బాట పట్టారని తెలుస్తోంది. గంజాయి ముఠాలు కూడా చదువుకునే విద్యార్థులనే ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఎల్బీ నగర్ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీసులు నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుండి 80 కిలోల గంజాయి, ఒక స్విఫ్ట్ కార్, కొంత నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
దాదాపు 15 లక్షల రూపాయలు ఈ గంజాయి విలువ ఉంటుందని తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ ప్రాంతంలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం జిల్లాలో కూడా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోందని తెలుస్తోంది. విద్యార్థులను, యువతను టార్గెట్ చేసుకొని ఒక జంట డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందటంతో నిక్కీ మరియు అతని గర్ల్ ఫ్రెండ్ సీతను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వీరి నుండి షాకింగ్ నిజాలు బయటికొచ్చాయని తెలుస్తోంది. విజయవాడకు చెందిన నరేంద్ర అలియాస్ విక్కీ డ్రగ్స్ కు బానిసై డ్రగ్స్ స్మగ్లర్ గా మారాడు. డ్రగ్స్ సరఫరా ద్వారా భారీగా ఆదాయం వస్తూ ఉండటంతో నరేంద్ర డ్రగ్స్ సరఫరాకే మొగ్గు చూపాడని పోలీసుల విచారణలో తేలింది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: