టెక్నాలజీ పెరుగుతుంది... కానీ పెరుగుతున్న టెక్నాలజీని చెడుకు ఉపయోగిస్తున్న వారు ఎక్కువవుతున్నారు. పాశ్చాత్య దేశాల పోకడను ఫాలో అవుతున్న భారతీయ యువత చెడు మార్గాల్లో నడుస్తున్నారు. డేటింగ్లు మీటింగ్లు అంటూ కొత్త పోకడలకు వెళుతూ... తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు వరకు మనకు ఆన్లైన్ లో ఏమైనా చెయ్యొచ్చు డబ్బులను పంపొచ్చు,  కూరగాయలను కొనొచ్చు,  బట్టలను కొనొచ్చు  ఇలా ఏదైనా చేయడానికి వీలుంది. అయితే ఇవన్నీ చేయడానికి రోజురోజుకి యాప్స్  పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా  డేటింగ్ ఆప్స్ కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న డేటింగ్ ఆప్స్ యువతను ఆకర్షిస్తూ పెడదారి పట్టిస్తుంది. అంతే కాకుండా ఇంకొన్ని సైట్లు  అందమైన అమ్మాయిల ఫోటోలు చూపించు యువతను ఆకర్షించి వారి దగ్గర్నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారమే విశాఖలో తాజాగా బయటపడింది. 

 

 

 
 
 
 
 విశాఖలో ఫేక్ డేటింగ్ సైట్  బండారం బయటపడింది. సైబర్ పోలీసులు ఫేక్ డేటింగ్ సైట్లతో  తో  యువతను ఆకర్షించి...  డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. హెని ట్రాప్ ముఠా లోని 26 మంది టెలీకాలర్స్  సహా 27 మందిని అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మూడు లాప్టాప్ లు  40 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా కోల్కతా కేంద్రంగా ఈ దందా సాగుతుంది.  డేటింగ్ యాప్ పేరుతో... అందమైన అమ్మాయిల ఫోటోలు చూపించి  యువతను ట్రాప్ లో దించుతున్నారు . ఇప్పటికే ఈ ఫేక్ డేటింగ్ సైట్లతో  ఎంతోమంది యువకులు మోసపోయారు. అందమైన అమ్మాయిలతో  ఫోటోలు తో ఆఫర్లు ప్రకటించి...తియ్యగా  మాట్లాడి ప్రజలను ఉచ్చులో పడేస్తున్నారు  ఈ ముఠా. ఇప్పటికే హెని ట్రాప్ ముఠాలో  లో చిక్కుకున్న వారు ఎంతోమంది.

 

 

 
 
 
 
 
 అయితే మోసపోయిన వాళ్ళు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టురట్టయింది. ఇప్పటికే హెని ట్రాప్   పడి ఒకరూ 18 లక్షలు మరొకరి  మూడు లక్షలు సమర్పించుకున్నారు. ఇంకా హెని  ట్రాప్  బాధితులు ఎంతో మంది ఉన్నట్లు సమాచారం. కాగా  విశాఖలో తీగలాగితే కొలకొత్తలో డొంక కదిలింది ఈ ముఠాది . కాగా  ఫేక్ డేటింగ్ సైట్ లతో ప్రజలను ఆకర్షించి ... అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి ఆకర్షనీయమైన ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తూ... తియ్యని మాటలతో ట్రాప్ లో పడేసి లక్షల దండుకుంటున్నారు. అయితే దీనిపై మరింత విచారణ జరిపి వివరాలు తెలుసుకునే పనిలో  పనిలో పడ్డారు పోలీసులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: