మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు ఘోరంగా దిగజారిపోతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వంశి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడంతో టీడీపీ వర్గాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగానే మరో టీడీపీ సీనియర్ నేత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సైతం టిడిపికి గుడ్ బై చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.


క‌ర‌ణం ముందుగా వైసీపీకి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తో భేటీ అయిన ఆయ‌న‌ తాజాగా బీజేపీ ఎంపీ సుజనాచౌదరితో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. టిడిపిలో ఉంటే తన వారసుడు కరణం వెంకటేష్ కు రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చిన బలరాం కొద్దిరోజులుగా తన వారసుడిని వైసీపీలోకి పంపే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వార‌సుడి రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించిన క‌ర‌ణం వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారని టాక్‌.


రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తన కుమారుడిని వైసీపీలోకి పంపి ఏదో ఒక మండలం నుంచి జడ్పీటీసీ గా పోటీ చేయించి.. జడ్పీ చైర్మ‌న్ ను చేయాలనీ కరణం భావిస్తున్నారట.. ఇందులో భాగంగానే వైసీపీతో చర్చలు జరుపుతున్నారట.. అయితే వైసీపీ నుంచి క‌ర‌ణం పెట్టిన డిమాండ్‌కు సానుకూల స్పందన రాకపోవడంతో వైసీపీకి జర్క్ ఇచ్చేందుకే సుజనాను కలిసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అంతెందుకు జ‌గ‌న్ ప‌ర్చూరులో ద‌గ్గుబాటి దంప‌తుల‌ను ఒకే పార్టీలో ఉండాల‌ని అల్టిమేటం జారీ చేయ‌డంతో ద‌గ్గుబాటి దంప‌తులు షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు టాక్‌. పురందేశ్వ‌రి బీజేపీలో ఉంటే... ద‌గ్గుబాటి రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక క‌ర‌ణం సైతం తాను టీడీపీలో ఉండి... త‌న కుమారుడిని వైసీపీలోకి పంపాల‌ని... అక్క‌డ ప‌ద‌వులు ఇవ్వాల‌ని పెట్టిన ప్ర‌పోజ‌ల్‌ను జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ట‌. దీంతో క‌ర‌ణం సుజ‌నాను క‌లిసి వైసీపీ నేత‌ల‌ను ఊరించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: