కృష్ణా జిల్లా పొలిటికల్ సర్కిల్లో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ అగ్గి రాజేసింది. వంశీ పార్టీ మార్పుపై గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా ఇవి రెండు రోజులుగా మ‌రింత ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వంశీ తాజాగా జిల్లాకే చెందిన మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో క‌లిసి సీఎం జగన్‌తో భేటి కావడంపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇక వంశీ త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు దాదాపు రెడీ అయిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.


వంశీ వైసీపీ ఎంట్రీ దాదాపు ఖాయం కావ‌డంతో జిల్లాలో రాజ‌కీయ ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోనున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నివాసం ఎదుట ఆందోళనకు దిగాయి. వల్లభనేని వద్దు - యార్లగడ్డ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అయితే వంశీ ఎపిసోడ్‌పై ఇప్పటికిప్పుడు తాను స్పందించలేనని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, నకిలీ పట్టాల వల్లే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో తాను ఓడిపోయానని యార్లగడ్డ అన్నారు.


యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుపై వంశీ గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 900 ఓట్ల మెజార్టీతో మాత్ర‌మే విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు వంశీ వైసీపీలోకి వ‌స్తే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు రాజ‌కీయ భ‌విత‌వ్యం గంర‌ద‌గోళంలో ప‌డ‌నుంది. అక్క‌డ వైసీపీ కోసం మూడు సంవ‌త్స‌రాలుగా క‌ష్ట‌ప‌డుతూ కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. ఎన్నిక‌ల్లో ఓడినా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌కు అందుబాటులోనే ఉంటున్నారు.


ఇక వంశీ పార్టీ మారి వైసీపీలోకి వ‌స్తోన్న క్ర‌మంలో యార్ల‌గ‌డ్డ తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని వంశీ పార్టీలో చేరే అంశంపై జగన్ ను కలిసిన తరువాతే స్పందిస్తానన్నారు. వంశీ వైసీపీలోకి వ‌చ్చి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే యార్ల‌గ‌డ్డ‌కు జ‌గ‌న్ ఎలా స‌ర్దుబాటు చేస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: