మనదేశంలో మనవలు, మనవరాళ్లు ఉన్న బామ్మలు ఏం చేస్తారు అంటే చేసేదేముంది... వాళ్లతో ఆడుకుంటూ ఉన్నారు లేదంటే భగవన్నామం తలుచుకుంటూ ఒక మూలన కూర్చుంటారు.  ఇక రాజకీయాల్లో ఉండే వ్యక్తులైతే ప్రజాసేవ అంటూ కాళ్లకు బలపాలు కట్టుకొని పరుగులు తీస్తుంటారు.  ఇది మామూలే అనుకోండి.  అయితే, అమెరికాకు చెందిన హట్టి అనే బామ్మ మాత్రం అలా కాదు.  


తనకు నచ్చినట్టుగా ఉంటుంది.  ఉండమని ఎవరు కాదన్నారు అని అంటే మీరు పప్పులో కాలు వేసినట్టే.  ఈ బామ్మ ఆ వయసులో కూడా తోడు వెతుక్కుంటోంది.  సరే పెద్దవయసు కదా ఏదో తోడు కావాలి అందుకే వెతుక్కుంటుంది అనుకుంటే పొరపాటే.. అదే కాదు.. ఆ వయసులో కూడా తనకు కోరికలు బలంగా ఉన్నాయని, తన కోరిక తీర్చే మగాడి కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్తోంది.  


మైండ్ బ్లాక్ అయ్యిందా.. అవ్వదా మరి..83 ఏళ్ళ వయసులో ఇలా ఎలా అనుకుంటున్నారా ఏమో ఇప్పటికి ఆమెలో ఆ కోరికలు విపరీతంగా ఉంటాయట.  అందుకే దానికోసం టింబర్ యాప్ లో జాయిన్ అయింది.  డేటింగ్ కు అందమైన యువకులు కావాలని పోస్ట్ లు చేసింది.  బామ్మ కోరికను తీర్చేందుకు చాలామంది ముందుకు వచ్చారట.  అలా చాలా మంది ఆమెతో ఎంజాయ్ చేశారట.  


తనకంటే 50 సంవత్సరాల చిన్న వాడైనా ఓ వ్యక్తితో కూడా ఈ బామ్మ డేటింగ్ చేసిందట.  ఇదెక్కడి విచిత్రం అని షాక్ అవ్వకండి.. కలికాలం కదా.. ఇలానే ఉంటుంది.  తనకు 25 సంవత్సరాల వయసులో ఉండగా పెళ్లి అయ్యిందని,  కొన్నాళ్ల తరువాత భర్త పోయాడని, అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నట్టు బామ్మ చెప్తోంది.  8 నెలల క్రితం టింబర్ యాప్ లో జాయిన్ అయిన బామ్మ ఇప్పటి వరకు 50 మందితో ఏకాంతంగా గడిపింది.  బామ్మ మజాకా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: