సమాజంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి రాక్షసుల్లా  మహిళలపై పడి అత్యాచారం చేస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు... ఎవరికీ సమాజంలో రక్షణ లేకుండా అయిపోయింది నేటి రోజుల్లో . ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే చాలు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు లో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితులు ఎంతటివారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు ఆమెకు అండగా నిలవాలని సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందుగా హోం మంత్రి సుచరిత ఘటనపై మీడియాతో మాట్లాడారు. లైంగిక దాడి చేసిన నిందితుడిని  24 గంటల్లోనే పట్టుకున్నామని తెలిపారు హోం మంత్రి సుచరిత. 

 

 

 

 అత్యాచార నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు ఆమె. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా ఈ అత్యాచార ఘటనపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లు విషయం కూడా తెలిసిందే. ఇలాంటి ఘటనల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీకి ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: