తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈడీల  కమిటీతో ఆర్టీసీ యూనియన్ల నేతల చర్చలు ప్రారంభమయ్యాయి. గత 22 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అయితే తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఆర్టీసీ సమ్మె ముగిసేది లేదని ఆర్టీసీ సంస్థ ముగుస్తుందని తెలిపారు. దీంతో ఆర్టీసీ కార్మికులు అయోమయంలో పడ్డారు. కాగా ఆర్టీసీ సమ్మె చట్టపరమైనది కాదని... ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఒక బుద్ధి లేని పని అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోసారి పునరాలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఆర్టీసీ కార్మికులు 21 డిమాండ్ ల పరిష్కారం కొరకు  ఈడీలకు కమిటీ ని నివేదిక తయారు చేయాలని నియమించిన విషయం తెలిసిందే . అయితే కేసీఆర్ ఆదేశాలతో ఈడీ  కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో నేడు చర్చలు ప్రారంభించింది . 

 

 

 

 ఎర్రమంజిల్  లోని ఆర్ అండ్ బీ  భవన్ లో చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే చర్చలకు ఆర్టీసీ జేఏసీ తరఫున అశ్వద్ధామ రెడ్డి, రాజారెడ్డి,  వి ఎస్ రావు,  వాసుదేవరావు లను  మాత్రమే అనుమతించారు. చర్చల కోసం నలుగురిని అనుమతిస్తే ఎలా అని అందరిని అనుమతించాలని మొదట  అశ్వద్ధామ రెడ్డి డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపేందుకు ఒక మెట్టు దిగి రావడంతో చర్చల్లో  పాల్గొన్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా... ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం 21 డిమాండ్ల పరిష్కారం  పైన నివేదికను పొందుపర్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు మొత్తం 46 డిమాండ్ పై చర్చలు జరపాలని అధికారులను కోరుతున్నారు. 

 

 

 

 

 అయితే ఈడీ  కమిటీ పొందుపరిచిన నివేదికలో  సత్వర పరిష్కారం అయ్యే డిమాండ్లు దీర్ఘకాలంలో పరిష్కారమయ్యే డిమాండ్లు  ఆర్థిక భారం పడే  డిమాండ్ లు  లెక్కన సమస్యలపై దృష్టి పెట్టి  నివేదికను రూపొందించింది. అయితే కార్మిక నేతలతో కూడా ఇదే విషయాన్ని వెల్లడించనుంది  ఈడీలా కమిటీ . అయితే ఒకవేళ చర్చలు విఫలమైతే... రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ సంస్థ పరిస్థితి ఏమవుతుందోనని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలై 22రోజులు  అయినప్పటికీ కూడా ఆర్టీసీ యూనియన్ లతో చర్చలు జరిపేందుకు విముఖతతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా ఒక మెట్టు దిగి వచ్చి చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఇప్పుడు సమ్మె విఫలమైతే కోర్టు ఆర్టీసీ నేతలతో చర్చలు జరిపినప్పటికీ కూడా కార్మికుల దిగి  రావట్లేదని హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక అందించే అవకాశం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ నేతలు మరియు ప్రభుత్వ మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవుతాయో  సఫలమవుతాయో  తెలియాలంటే చర్చలు ముగిసే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: