తూర్పుగోదావరి జిల్లా రాజోలు రాజకీయం రచ్చ రేపుతోంది. ఎన్నికలు గడిచి ఐదు నెలలైనా ఇంకా వేడి తగ్గలేదు.  ఈ పంచాయితీ  ఏకంగా హైకోర్టు వరకు వెళ్ళింది. కోర్టు నోటీసులొచ్చాయని ఒకరంటుంటే..వీటిని కొట్టి పారేస్తున్నారు మరొకరు.  రాజోలులో రణరంగంగా మారిన రాజకీయ దుమారం ఏంటో ఓ సారి చూద్దాం..  


తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ కో ఆర్డినేటర్ బొంత రాజేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎమ్మెల్యే రాపాక తోపాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేశారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది హైకోర్టు. అలాగే జనసేన ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.


రాపాక వరప్రసాద్ రావు రాజోలు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండేవారు. దీంతో 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజోలు    నుంచి రాపాకకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో రాపాక ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికలు, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2019 ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు. రాజోలు నుంచి  జనసేన అభ్యర్థిగా  పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఏపీలో జనసేన తరుపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాత్రమే. 


అయితే  ఓటమి పాలైన వైసిపి అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల  సమయంలో  గల్ఫ్ లో ఉన్న  స్థానికుల ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను  ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తనకు అనుకూలంగా వేయించుకున్నారని ఆరోపించారు. అలాగే పోలింగ్ కేంద్రాల లోపలికి  వైసిపి వారిని అనుమతించకుండా అడ్డుకున్నారని, దీనిపై ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారి పట్టించుకోవడం లేదని  బొంతు రాజేశ్వరరావు  హైకోర్టులో ఫిర్యాదు చేశారు. రెండు నెలల్లో   హైకోర్టు  తీర్పు రావడం, తాను ఎమ్మెల్యే కావడం  ఖాయమని  బొంతు రాజేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ నేత  ఆరోపణలను కొట్టి పాడేస్తున్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఓటమితో మతిభ్రమించి తప్పడు ఆరోపణలు  చేస్తున్నారని  విమర్శించారు.   


ఇరువురు నేతల  మధ్య  జరుగుతున్న వివాదం  రాజోలు రాజకీయాల్లో వేడిపుట్టిస్తోంది. ప్రస్తుతం అధికార పార్టీ  రాజోలు నియోజకవర్గం  ఇన్ ఛార్జ్ గా  పని చేస్తున్న బొంతును రాజకీయంగా ఇరుకున పెట్టాలని  ఎమ్మెల్యే రాపాక ప్రయత్నిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. బొంతు ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. బొంతు రాజేశ్వరరావు కూడా ఎత్తుకు పైఎత్తులు  వేస్తున్నారు. ఇటీవల మల్కిపురం పోలీసుస్టేషన్ లో వివాదం  కూడా  బొంతు రాజేశ్వరరావు తెర వెనుక నడిపించారనేది  ఎమ్మెల్యే  ఆరోపణ.  ఏది ఏమైనా  హైకోర్టు నోటీసులతో  రాజోలు రాజకీయ  విభేదాలు రచ్చకెక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: