2018 ప్రపంచ ధనికుల జాబితాలో మొదటి స్థానాన్ని అధిరోహించి అమెజాన్  సీఈఓ జెఫ్ బెజోస్ చరిత్ర సృష్టించారు. ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను దాటి న౦ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రస్తుత స్టాక్ మార్కెట్ వాల్యూస్ ప్రకారం అమెజాన్ Q3 ఫలితాల్లో దాదాపుగా $7 బిలియన్ ను కోల్పోయి జెఫ్ బెజోస్ తన అగ్రస్థానం నుంచి కిందకి పడ్డారు. మొన్న గురువారం నాడు జరిగిన స్టాక్ మార్కెట్ వాల్యూస్ లో అమెజాన్ షేర్స్ 7 % పడిపోగా జెఫ్ బెజోస్ కి $103.9 బిలియన్స్ తో లోటును మిగిల్చింది.


మరో పక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ $105.7 బిలియన్స్ ఆర్థికత అభివృద్ధిని కలిగిఉన్నారు. చెప్పాలంటే 2018 ముందు వరకు 14 ఏళ్ల పాటు ధనికుల జాబితాలో మొదటి స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సొంతం. ఆయన 1987 లొనే ప్రతిష్టాత్మకమైనే  ఫోర్బ్స్ లిస్టులో బిలినియర్ గా  స్థానం సంపాదించుకున్నారు. ఇక జెఫ్ బెజోస్ విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా 1998లో  అమెరికా ధనవంతుల ఫోర్బ్స్ లిస్టులో 400 స్థానాన్ని సంపాదించుకున్నారు. 

అలాంటి జెఫ్ బెజోస్ 2018 లో $160 బిలియన్ తో బిల్ గేట్స్ ను దాటారు. అలాంటిది ఇప్పుడు కొన్నీ గంటల వ్యవధిలో నే అమెజాన్ తన 9 % శాతం ఆర్థికతను ను $1,624 విలువగల షేర్స్ ను పోగొట్టుకొని తన స్థానాన్ని జెఫ్ బెజోస్ చేజార్చుకున్నారు. ఇదంతా తన Q3 ఫలితాల్లో ముందుచూపు లేకపోవడం వల్ల స్టాక్ వాల్యూ ని పోగొట్టుకొని అగ్రస్థానం నుండి పడిపోయారు. ఇక పోతే భారత వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ అంతకుముందు ఈ అగ్రస్తానాన్ని అందుకొన్నా అది మూడు నాళ్ల ముచ్చట గానే మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: