జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌లోని మంత్రులు అబద్ధాలు, అసత్యాలు ఎక్కువచెబుతూ, అవగాహనరాహిత్యంతో, విషయపరిజ్ఞానంలేకుండా మాట్లాడుతున్నారని, రవాణా,  సమాచార, ప్రసారశాఖమంత్రి పేర్నినాని వ్యాఖ్యలే అందుకు ఉదాహరణని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య దెప్పిపొడిచారు. చంద్రబాబు రూ.10కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలో ధర్నాచేశారని, ప్రభుత్వంలో ఉండి ప్రజాధనాన్ని వృథా చేశారని దుష్ప్రచారం చేస్తున్న పేర్నినానిగారు, ప్రభుత్వంలో ఉండి వాస్తవాలు తెలుసుకోలేక పోవడం విచారకరమన్నారు. 

ముఖ్యమంత్రిహోదాలో నాడు చంద్రబాబు ఢిల్లీలోచేసినదీక్షకు కేవలం రూ.కోటి60లక్షలు మాత్రమే ఖర్చయ్యాయని, రూ.10కోట్లకు ఇచ్చిన జీవోను వెంటనే సరిచేయాలని ఆనాడు చంద్రబాబు అధికారులను ఆదేశించారని రామయ్య పేర్కొన్నారు. ఈ విషయాలు తెలియాలంటే, మంత్రి నాని నాటి అధికారులను సంప్రదించా లన్నారు. ఈ అంశంపై మంత్రినానికి ఏవైనా సందేహాలుంటే ఆయనతో బహిరంగచర్చకు తాను సిద్ధమని, మీడియా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సమక్షంలో తనతో చర్చించడానికి మంత్రి సిద్ధమేనా అని రామయ్య ప్రశ్నించారు. 


సోమవారంనాడు సచివాలయంలోనే మంత్రితో చర్చిస్తానని, అంశంపై తనవైఖరేమిటో నానీనే చెప్పాలని వర్ల సూచించారు. ధర్మపోరాట దీక్షకు ఖర్చయింది రూ.కోటి60లక్షలని తానునిరూపిస్తానని, కాదు రూ.10 కోట్లు ఖర్చయిందని మంత్రి నిరూపించగలడా అని టీడీపీనేత నిలదీశారు. తాను మంత్రి ననే విషయం మర్చిపోయిన నాని, మాటలకు విలువలేకుండా ఇష్టమొచ్చినట్లు నరంలేని నాలుకను ఉపయోగంచడం ఆయనకు మంచిదికాదని వర్ల హితవుపలికారు.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూపాయి జీతం తీసుకుంటున్నానంటూ, రూ.15కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మంత్రి నానీకి తెలియదా అని వర్ల ప్రశ్నించా రు.

ముఖ్యమంత్రి క్యాంప్‌కార్యాలయ మరమ్మతులకు రూ.15కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం లో మంత్రిగాఉన్న పేర్నినాని, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10కోట్లు దీక్షలకు ఖర్చుచేశారని అసత్యప్రచారంచేయడం ఆయనలోని అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం తెలుగుదేశంపార్టీ నిర్వహించిన ఇసుకపోరాటంతో రాష్ట్రప్రభు త్వం ఉలిక్కిపడిందని, పోలీసులను అడ్డుపెట్టుకొని ఎక్కడికక్కడ టీడీపీనేతలను అరెస్ట్‌ చేయించడమే సర్కారు ఉలికిపాటుకు సంకేతమని వర్ల ధ్వజమెత్తారు. టీడీపీ దీక్షలకు తరలివస్తున్న వారిని అరెస్ట్‌చేయాల్సిన అవసరం, అగత్యం ప్రభుత్వానికి ఎందుకొచ్చాయన్నా రు. వైసీపీ సర్కారు భయపడబట్టే, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీశ్రేణుల అరెస్టులకు, అడ్డగింతలకు పాల్పడిందని రామయ్య మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్నవారిపై అణచివేతలకు పాల్పడటం, తప్పుడుకేసులుమోపి అరెస్ట్‌లు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. తనతండ్రి నుంచి జగన్‌ ఏవిధమైన పరిపాలనా  విషయాలు నేర్చుకోలేదని, ప్రజాస్వామ్యంలో తలలు, కాళ్లు తీసేస్తామంటే ఎవరూ ఊరుకోర నే సంగతిని ఆయన గ్రహించాలని రామయ్య చురకలంటించారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: