ఏపీలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయా..?  మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితులు చూస్తుంటే ఏపీలో రాజ‌కీయంగా పెనుమార్పులు సంభ‌వించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయా.?  ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ళ్ళు తెరిస్తే చంద్రాలు ప‌ద‌వి గోవిందేనా..?  టీడీపీ గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇస్తున్న ఝ‌ల‌క్‌తో చంద్ర‌బాబుకు ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లేనా..?  తెలంగాణ‌లో జ‌రిగిన రాజ‌కీయ గేమ్ ఇప్పుడు ఏపీలో తెర లేచిందా..?  తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన ఎత్తులు.. ఇప్పుడు ఏపీలో సీఎం జ‌గ‌న్ అవే ఎత్తులు వేస్తున్నారా..? ఈ ఎత్తుల‌తో చంద్ర‌బాబు కొంప కొల్లేరేనా..?  అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఇంత‌కు ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఏంటో ఓసారి లుక్కేద్దాం.


ఏపీలో ఇప్పుడు టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును చావు దెబ్బ తీసే ఎత్తుగ‌డ‌ల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌క్కా వ్యూహం ప‌న్నిన‌ట్లు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. జ‌గ‌న్ 2024 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టి నుంచే రాజ‌కీయంగా పావులు క‌దుపుతున్నారు. అందులో భాగంగానే అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూనే మ‌రోవైపు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు అమ‌లు చేస్తున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ వేస్తున్న ఎత్తులు చూస్తుంటే ప్ర‌తిప‌క్షాల‌కు, క‌రుడుగ‌ట్టిన రాజ‌కీయ నేత‌ల‌కు దిమ్మ తిర‌గాల్సిందే.


చంద్రబాబును ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా లేకుండా చేసేందుకు జ‌గ‌న్ ఎత్తులు వేస్తున్నార‌ట‌. అందుకు జ‌గ‌న్ టీడీపీ అమ్ముల పోదిలో అస్త్రంగా ఉన్న గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ని అదే పార్టీ పైకి వ‌దులుతున్నాడు. ఆ అస్త్రంను వైసీపీ తిరిగి టీడీపీపై ప్ర‌యోగిస్తే అది స‌క్సెస్ అయితే టీడీపీ బంగాళ ఖాతంలో కలిసిన‌ట్లే లెక్క‌. చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా డాంబికాల‌కు పోతున్నారు. తానే ఇంకా అధికారంలో ఉన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇస్తున్నారు.


అయితే ప్ర‌తిప‌క్ష నేత హోదాకు ఎస‌రు పెట్టాల‌ని వైసీపీ వ్యూహం ప‌న్నుతుంది. అందులో భాగంగా టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొంద‌రిని త‌న‌వైపుకు లాక్కోవాల‌నే ఆలోచ‌న‌తో జ‌గ‌న్ స‌ర్కారు ఉంది. అందుకే వ‌ల్ల‌భ‌నేని వంశీని వైసీపీలోకి తీసుకునేందుకు రంగం సిద్దమైంది. వంశీతో పాటుగా ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో మ‌రో ప‌ది మంది ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే క‌నుక జ‌రిగితే 10మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే చంద్ర‌బాబుకు ప్ర‌తిప‌క్ష నేత హోదా గోవిందా గోవిందా. ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్రబాబు ఉండాలంటే క‌నీసం 18మంది ఎమ్మెల్యేలు కావాలి.


ఇప్పుడు టీడీపీ కి ఉన్న‌ది 23 మంది. ఇందులో 10మంది వైసీపీ వైపు వెళితే ఇక టీడీపీ కి మిగిలేది కేవ‌లం 13 మందే. అంటే ప్ర‌తిప‌క్ష హోదాకు అన‌ర్హ‌త కోల్పోయిన‌ట్లే లెక్క‌. వైసీపీ వైపు మ‌రో ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్ చేసినా చంద్ర‌బాబుకు ప్ర‌తిప‌క్ష నేత హోదా గ‌ల్లంతే. ఈలెక్క‌న వంశీతో పాటుగా మ‌రో ప‌ది మంది జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్నారు క‌నుక వారిని టీడీపీకి రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల్లో వారిని గెలిపించుకుంటే జ‌గ‌న్ స్కెచ్ ఫ‌లించిన‌ట్లే.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం ప‌రిస‌మాప్తే.


మరింత సమాచారం తెలుసుకోండి: