నమ్మి నెత్తిన పెట్టుకుంటే నమ్మకద్రోహం చేసి పార్టీ మారిన నేతల్లో గొట్టిపాటి రవికుమార్ ఒకరు. వైసీపీలో ఉండగా జగన్...గొట్టిపాటికి చాలా విలువ ఇచ్చారు. గొట్టిపాటిని అత్యంత సన్నిహితుడుగా భావించారు. కానీ ఊహించని విధంగా నమ్మక ద్రోహం చేస్తూ గొట్టిపాటి 2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళిపోయారు. కానీ మొన్న ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అటు గొట్టిపాటి కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.


అయితే అధికారం లేకపోవడంతో వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు. నమ్మక ద్రోహం చేసిన నేతలని పార్టీలోకి చేర్చుకునేదే లేదని తేల్చే చెప్పేశారట. దీంతో వైసీపీలో గొట్టిపాటి చేరికకు రెడ్ సిగ్నల్ పడిపోయింది. అయినా  గొట్టిపాటి పదే పదే పార్టీలోకి వచ్చేందుకు లాబీయింగ్ చేసి జగన్ ని విసిగించినట్లు తెలిసింది. అందుకే జగన్ ఇటీవల అద్దంకి వైసీపీ ఇన్ చార్జ్ గా బాచిన కృష్ణచైతన్యని నియమించి, గొట్టిపాటి లాబీయింగ్ కు అడ్డుకట్ట వేశారు.


ఇక గొట్టిపాటి విషయం పక్కనబెడితే ఇదే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని చేర్చుకునేందుకు జగన్ ఆసక్తిగా ఉన్నారని సమాచారం. కరణం కూడా త్వరలో జగన్‌ను కలిసి పార్టీ మార్పుపై చర్చించబోతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి పుట్టినరోజు వేడుకల్లో బలరాం, ఆయన కుమారుడు వెంకటేశ్ సందడి చేసిన విషయం తెలిసిందే. అప్పుడే పార్టీ మార్పుపై ఎంపీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కరణం కుటుంబం పార్టీలోకి వస్తే  సముచిత స్థానం కల్పించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


ఎందుకంటే కరణంకు అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలతో పాటు, ఒంగోలు పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే కరణం వస్తే వైసీపీ మరింత బలోపేతం అవుతుందని జగన్ ఆలోచిస్తున్నారు. త్వరలోనే కరణం ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే వైసీపీలో చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: