సాకే శైలజానాధ్... కాంగ్రెస్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. అయితే 2014 వ సంవత్సరం నుంచి శైలజానాధ్ రాజకీయంగా కాస్త కష్టాలలో ఉన్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న శైలజా నాథ్ జగన్ పార్టీ పెట్టినప్పుడు మాత్రం అతని వెంట వెల్లకుండా కాంగ్రెస్ లోనే కోన సాగుతూ వచ్చారు. అయితే అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీనే చేస్తుందని శైలజానాధ్ అస్సలు ఊహించలేదు. 


ఎంత వ్యతిరేకించినా రాష్ట్ర విభజన చేశారు కేంద్రంలోని కాంగ్రెస్ నేతలు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగై పోయింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తామని అధిష్టానం సంకేతాలు పంపుతున్నా ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. శైలజానాధ్ 2009, 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 


వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరొందారు. దళిత నేత కావడంతో సహజంగానే కాంగ్రెస్ లో తొందరగా ఎదిగారు. అయితే అదే కాంగ్రెస్ ను ఆయన వీడలేదు. ఇంకా జగన్ పార్టీకి వెళ్లలేదు. ఫలితంగా అదే నియోజకవర్గమైన సింగనమల నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు కూడా. నిజానికి శైలజానాధ్ కు కాంగ్రెస్ వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ, తెలుగుదేశం పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా ఆయన కాదనుకున్నారు. శైలజానాధ్ కు కాంగ్రెస్ అధిష్టానం వద్ద బాగా పట్టుంది. యువకుడు, సబైక్ ఉన్న నేత కావడంతో రాహుల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా శైలజానాధ్ కు ప్రయారిటీ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల సమయంలో శైలజానాధ్ కు కీలక బాధ్యతలను అప్పగించారు. 


తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చడంతో శైలజానాధ్ కు పార్టీ హైకమాండ్ వద్ద ప్రత్యేక గుర్తింపు లభించింది. తాజాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక్కడ ఏపీసీసీ చీఫ్ గా ఉన్న రఘువీరారెడ్డి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షుడు లేరు. దీంతో పార్టీ అధిష్టానం శైలజనాధ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శైలజానాధ్ అయితే దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకోగలరని నమ్ముతుంది. గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గా ఉన్న దళితులు జగన్ పార్టీ వైపు వెళ్లారు. తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లాలంటే శైలజానాధ్ కు అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే శైలజానాధ్ ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తాను ఆ బాధ్యతలను నెరవేర్చలేనని అధిష్టానంతో చెప్పినట్లు సమాచారం. అయినా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందంటా అధిష్టానం. మరి శైలజానాధ్ ఏపీకి కాంగ్రెస్ చీఫ్ అవుతారా, లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: