ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఇసుక రాజకీయం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత కారణంగా... భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి లేక పస్తులు ఉంటున్నారని ... వాళ్ల కుటుంబాలు  మొత్తం రోడ్డున పడ్డాయని ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసిపి ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతుంది కాబట్టే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని... విమర్శలు చేస్తున్నాయి . ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటూ చలో  విశాఖ కు శ్రీకారం చుట్టారు జనసేన నేతలు. అయితే తాజాగా ఈ నిరసనలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. 



 పవన్ కళ్యాణ్  జగన్ పై ఇసుక  విషయంలో  విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పలు విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారం లేకుండా ఉండలేరని ... గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తోకల  వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్ను  బీజేపీ పై పడడంతో బీజేపీ కి చేరువయ్యేందుకు  కళ్యాణ్  ప్రయత్నిస్తున్నారని అన్నారు. 2009 ఎన్నికల్లో కూడా తన అన్న చిరంజీవికి అధికారం దక్కక పోయేసరికి... చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ దూరంగా వచ్చేశారని  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. 



 అయితే ఎలాగైనా మోడీతో జతకట్టేందుకు పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డిపై   జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అనవసర విమర్శలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ను విమర్శిస్తే రాష్ట్ర ప్రజల మద్దతు పలుకుతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రమ  పడుతున్నారని మంత్రి విమర్శించారు. ఇసుక కొరత అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్ధరహితం గా ఉన్నాయని... ఓవైపు భారీ వర్షాలు పడి నదులు పొంగి పొర్లుతుంటే  ఇసుక ఎలా తవ్వుతారు  అని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు . పవన్ కళ్యాణ్ ఒకసారి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కు వచ్చి చూస్తే వరద ఎంతలా పోటెత్తుతుందో   ఆయనకు అర్థం అవుతుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: