ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో ఆంక్షలు విధించిన తరువాత అక్కడి ప్రజలు బయటకు రాలేదు.  దాదాపు 50 రోజుల తరువాత ఆంక్షలు సడలించారు.  ఎప్పుడైతే ఆంక్షలు సడలించారో అప్పటి నుంచి ప్రజలు బయటకు వస్తున్నారు.  ఎవరిపనులు వాళ్ళు చేసుకుంటున్నారు.  అయితే,రాష్ట్రంలోకి ఉగ్రవాదులను దేశంలోకి ఎంటర్ కానివ్వకుండా ఇండియన్ ఆర్మీ నిత్యం పహారా కాస్తోంది. 


అయితే, దేశంలో ఆంక్షలు సడలించడంతో అప్పటికే రాష్ట్రంలో కాపు కాస్తున్న ఉగ్రవాదులు ప్రజలను, సిఆర్పిఎఫ్ ఆర్మీ జవానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు సిద్ధం అయ్యింది.  కాగా, దీపావళి సందర్భంగా దేశంలో బ్లాస్టులు చేస్తామని హెచ్చరించింది.  ఐబి సైతం ఉగ్రవాదులు దేశంలో బ్లాస్టులు జరిపే అవకాశం ఉందని చెప్పడంతో.. ఆర్మీ అలర్ట్ అయ్యింది.  


కాగా, జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  సిఆర్పిఎఫ్ జవానులను లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్ దాడులు చేసింది.  దాంతో పాటు ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆరుగురు జవానులు గాయపడ్డారు.  కాగా, ఆర్మీ ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు పారిపోయారు.  ప్రస్తుతం వారికోసం జమ్మూ కాశ్మీర్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.  


గాయపడిన ఆర్మీ జవానులకు చికిత్స అందిస్తున్నారు.  స్థానికుల సహకారంతోనే ఉగ్రవాదులు దేశంలో దాడులకు పాల్పడుతున్నారు.  మొదట వారికీ సహకరిస్తున్న లోకల్ వ్యక్తులను పట్టుకొని వారి నుంచి సమాచారం సేకరిస్తే.. అన్ని ఏవ్ సర్దుకుంటాయి.  ప్రతి ఒక్క ఉగ్రవాది పేరు బయటకు వస్తుంది.  ఎప్పటి నుంచో జమ్మూ కాశ్మీర్ లో సంబంధాలు ఉండటంతో కొంతమంది వారికి సహకరిస్తున్నారని సమాచారం.  కాగా, అక్టోబర్ 31 వ తేదీ తరువాత జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలు పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారబోతున్నాయి.  పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగిన కొన్ని రోజులకే ఇలా జరగడం దారుణం అని చెప్పాలి.  మరి దీనికి ఆర్మీ ఎలా జవాబు చెప్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: