వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనిక్‌ వే లో పాలనను సాగిస్తున్నారు. రివర్స్ టెండరింగ్, పరిశ్రమలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, గ్రామ వాలంటీర్లు లాంటి ప్రొగ్రామ్స్ అమలు దిశగా ముందుకెళ్తూ..దేశంలోనే ఓ నూతన ఒరవడిని క్రియేట్ చేశారు. అంతేకాదు తప్పు చేస్తే సొంతపార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ టోల్రేట్ చెయ్యడం లేదు. అందుకు ఇటీవల జరిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టే ప్రత్యక్ష ఉదాహారణ. ఇక మరోవైపు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా జగన్ పోలీసులకు స్ట్రిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. తప్పు చేస్తే ఎవ్వర్నీ ఉపేక్షించవద్దని అల్టిమేటం జారీ చేశారు.తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై.. యువకుడు నరేంద్ర రెడ్డి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.



వారం రోజులుగా చిన్నారి నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు నరేంద్ర రెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారంటూ బాలిక బంధువులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళన విషయం  సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. నిందితులు విషయంలో చర్యలు ఎంతవరకు వచ్చాయని పోలీసు బాస్‌లను ప్రశ్నించారు.



తప్పుచేసినవారు ఎంతటివారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారులు బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పోలీస్ రిపోర్ట్ అందగానే బాధిత బాలిక కుటుంబానికి మొదట కొంత ఆర్థిక సహాయం అందుతుందన్నారు. చార్జిషీట్ దాఖలయ్యాక మరికొంత ఆర్థిక సహాయం అందుతుందన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: