భవిష్యత్ లో ఏ అగ్రిగోల్డ్ బాధితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డనేటర్ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్ రెడ్డి పునర్జన్మ నిచ్చారని బాధితులు చెప్పుకుంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఒక రోజు ముందే దీపావళి వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రతి రోజు బడుగు బలహీన వర్గాలకు మంచి కోసమే ఆలోచిస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు కోసం తొలివిడతలో 3లక్షల 70 వేల మంది బాధితుల కోసం 264 కోట్లు విడుదల చేశారు. రెండవ విడతలో 886 కోట్లు అగ్రిగోల్డ్ బాధితుల కోసం విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్  పై బాధితులు నమ్మకం విశ్వాసం ఉంచారని చెప్పారు. వారి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారని స్పష్టం చేశారు. ఏ ప్రైవేట్ సంస్థ మోసం చేసిన పాలక ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు.. రాజ్యాంగ కూడా ఒప్పుకోదన్నారు.


న్యాయపరమైన ఇబ్బదులు అధిగమించి 1150 కోట్లు నోటి మాటగా కాకుండా జోవో విడుదల చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పరనేది మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబు ఖాళీ ఖాజానాను జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చారని చెప్పారు. 
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులు కోసం 1150 కోట్లు విడుదల చేశారని చెప్పారు. చంద్రబాబు లోకేష్ సిగ్గుండే విమర్శలు చేస్తున్నారఐ వ్యాఖ్యానించారు. కోతల ప్రభుత్వం చంద్రబాబుది, జగన్మోహన్ రెడ్డి చేతల ప్రభుత్వమని అన్నారు. అగ్రిగోల్డ్ అనేది చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పుట్టింది. అగ్రిగోల్డ్ స్కామ్ కూడా చంద్రబాబు హయాంలోనే బైట పడిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని చంద్రబాబుని కోరితే ఆయనేమో అరెస్టులు చేయించారని విమర్శించారు.



చంద్రబాబు నిర్వహకం వలన 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ కు చనిపోయారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను అడుకోకుండా కమిటీలతో చంద్రబాబు కాలయాపన చేశారని ఎద్దవా చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కాజేశారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి కుటంబం ఒక మాట ఇస్తే నెరవేర్చి తీరుతుంది. చంద్రబాబు అగ్రిగోల్డ్ అస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని మాటలు చెపితే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మకుండా బాధితులకు న్యాయం చేస్తున్నారు. ఈ నెల 29 తేదీన అన్ని అగ్రిగోల్డ్ బాధిత సంఘాల తో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. భవిష్యత్ లో ఏ అగ్రిగోల్డ్ బాధితుడు ఆత్మహత్య చేసుకోరాదన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: