దగ్గుబాటి వెంకటేశ్వరరావును యాక్సిడెంటల్ పొలిటీషియన్ అంటారు. ఆయన ఎపుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు.  ఆయన ఎన్టీయార్ కుటుంబ సభ్యుడిగా పెద్దల్లుడిగా ఉన్న సమయంలో మామ గారిని, అక్కినేనిని హీరోగా పెట్టి సత్యం శివం మూవీ తీశారు. అలాగే అన్న గారుతోనే ఆటగాడు మూవీ కూడా తీశారు. అలా సినీ  నిర్మాత అయ్యారు. ఇక అన్న గారు రాజకీయాల్లోకి రావడంతోనే ఆయన కూడా రాజకీయ నాయకుడు అయిపోయారు. మొదట్లో ఇష్టం లేకపోయినా మామగారికి సాయం చేయడానికి రంగంలోకి దిగిన దగ్గుబాటి తరువాత కాలంలో సీరియస్ పొలిటీషియన్ గా మారిపోయారు.


అయితే దగ్గుబాటిది ప్లెయిన్  హార్ట్. ఆయనకు రాజకీయాలు ఇష్టమే కానీ పదవుల కోసం కుట్ర రాజకీయాలు చేయడం రాదు. అయితే ఆయన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు పన్నిన పన్నాగంలో పావుగా మారారు. అలా సొంత మామ మీద కుట్ర చేసిన దాంట్లో తెలియకుండానే భాగస్వామి అయ్యారు. ఇదిలా ఉండగా దగ్గుబాటి టీడీపీ నుంచి బయటకు వచ్చాక అనేక పార్టీలు మారారు. ఆయన లక్ష్మీపార్వతి టీడీపీలో కూడా కొన్నాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.


తరువాత బీజేపీ, కాంగ్రెస్  ఇలా మారిన తరువాత ఇపుడు వైసీపీలోకి వచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసి పరుచూరులో ఓటమి పాలు అయ్యాక దగ్గుబాటి అయిదు నెలలుగా మౌనంగా  ఉంటూ వచ్చారు. దగ్గుబాటి దంపతులు ఒకేపార్టీలో ఉండాలన్న జగన్ నిర్ణయం  వల్ల దగ్గుబాటి చిక్కుల్లో పడ్డారు. ఆయన సతీమణి పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఇక దగ్గుబాటి భార్యకు అక్కడ పొజిషన్ బాగానే ఉందని రానంటున్నారట. దాంతో ఇక దగ్గుబాటి తనకు  తానే రాజకీయంగా త్యాగం చేయ‌దలచుకున్నారు. అందువల్ల ఆయన  వైసీపీ నుంచి పక్కకు తొల‌గిపోతున్నారు. నిన్న  పార్టీ అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సో. దగ్గుబాటి రాజకీయ జీవితం ఇంతటితో ముగిసిందనుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: