గత కొద్దిరోజులుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్ పై గందరోగోళం నెలకొంది. దానికీ కారణం   దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య బిజెపి మహిళా అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది బిజెపి లో యాక్టివ్ గా ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న తప్పులను సీఎం జగన్ చేస్తున్నారంటూ పదేపదే విమర్శించారు అలాగే రాజధాని విషయంలో కూడా జగన్ తో విభేదించారు ఈ విషయంలో జగన్ చాలా సీరియస్ గ  తీసుకున్నారు ఇటీవలే సీఎం జగన్ తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ చెంచురాంతో కలిసి భేటీ అయ్యారు


ఈ సందర్భంగా జగన్ భార్యాభర్తలిద్దరూ వేరే పార్టీలో ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలంటే జగన్ కండిషన్ పెట్టారు పురంధరేశ్వరి వైసీపీ లో చేరితే ఆమెకు తగిన ప్రాధాన్యత ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది రాబోయే   రోజుల్లో ఆమెను రాజ్యసభకు పంపిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం  బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఇకపోతే పర్చూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత రఘునాథబాబు తిరిగి వైసీపీలో చేరడంతో గందరగోళం నెలకొంది .

ఆయన పర్చూరు నియోజకవర్గం ఇన్చార్జి ఇస్తారంటూ * ప్రచారం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో దగ్గుబాటి అనుచరులు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో భేటీ అయ్యారు నియోజకవర్గ ఇన్చార్జిగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొనసాగించాలని డిమాండ్ చేశారు అయితే దగ్గుబాటి వెంకటేశ్వరావు దంపతులు ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సీఎం జగన్ స్పష్టంగా తెలియజేశారు అని చెప్పుకొచ్చారు ఏ పార్టీలో ఉంటారో దగ్గుబాటి దంపతులు తేల్చుకోవాలని సీఎం జగన్ చెప్పారని వారి చేతుల్లోనే ఉందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: