గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడినా, పత్రికా ప్రకటనలు చేస్తున్నా ఒక్కటే సబ్జెక్ట్. ఆయన గురి ఒక వైపే ఉంది. ఆయన ఒక వైపే చూస్తున్నారు. ఆయన చాలా ఈజీగా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో సహజంగానే అవతలవారికి మండుకొస్తోంది. అయితే ఇన్నాళ్ళు  మౌనంగా ఉన్న వారు ఒక్కసారిగా మూకుమ్మడిగా పడిపోయారు. పవన్ని నలువైపులా చుట్టుముట్టేశారు. దట్టించి మరీ  దులిపేశారు. ఇంతకీ ఏమా కధ...


అంటే పవన్ని వైసీపీ మంత్రులు, నేతలు ఒక్కసారిగా వేసుకున్నారన్న మాట.  అలా ఇలా కాదు మాటలే తూటాలుగా పేల్చేశారు. పవన్ ప్యాకేజి మనిషి మంత్రి శంకర్ నారాయణ అంటే పవన్ అధికారం ఉన్న చోటే చేరుతాడంటూ ఒకనాటి ప్రజారాజ్యం నాయకుడు, ప్రస్తుతం మంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు నాడు చంద్రబాబు తోకపట్టుకుని అయిదేళ్ళు నడచిన పవన్ ఇపుడు మోడీతో జట్టు కట్టేందుకు తహతహలాడుతున్నారని కొత్త విషయం బయటపెట్టారు.


పవన్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న జగన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ అంబటి రాంబాబు నిలదీశారు. పవన్ బాబు చెప్పినట్లు చేస్తున్నారని, ఆయన కోసమే రాజకీయం చేస్తున్నారని అంబటి విరుచుకుపడ్డారు. పవన్ కి బాబు తప్పుడు పనులు కనిపించలేదా అని అంబటి ప్రశ్నించారు.


ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ట్విట్టర్ ద్వారా పవన్ మీద గట్టి విమర్శలే చేశారు. పవన్ వారసత్వ రాజకీయల గురించి మాట్లాడుతున్నారు, కానీ అసలు ఆయన తన బాస్ చంద్రబాబు కుటుబం గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అదే విధంగా తన అన్న నాగబాబుకు ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. అంతకు ముందు మంత్రి పేర్ని నాని సైతం  పవన్ మీద గట్టిగానే తగులుకున్నారు. మొత్తం మీద చూస్తే నాలుగు వైపుల నుంచి పవన్ మీద దాడి మొదలైంది మరి దీనికి పవన్ ఏ విధంగా జవాబు చెప్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: