ఏపీలో రాజకీయాలు గమనించిన వారికి ఒక విషయం అర్ధమవుతోంది. బంపర్ మెజారిటీని సాధించి అధికారంలో ఉన్న జగన్ ఓ వైపు  ఉంటే మరో వైపు హోల్ మొత్తం ప్రతిపక్షాలు ఉన్నాయి. జగన్ ఒక్కడూ ఓ వైపు, ఇతర పార్టీలు మరో వైపు అని కూడా బోధపడుతుంది. ఇది ఎన్నికల ముందు నుంచి కూడా ఉంది. ఎన్నికల తరువాత కూడా అదే కొనసాగుతోంది. మూకుమ్మడిగా ప్రతిపక్షాలు మాటల బాణాలు ఒక్కడి మీదనే పడుతున్నాయి.


అదీ కూడా అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే. ఇపుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం ఎలా ఉంటుందో కూడా వూహించేయవచ్చు అంటున్నారు. జగన్ మీద చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలు మరీ చౌకబారుగా ఉండడమే కాకుండా తేలిపోతున్నాయని అంటున్నారు. జగన్ ఓ వైపు జోరుగా సంక్షేమ కార్యక్రమాలు ఒకటి తరువాత మరొకటి చేసుకుంటూ పోతున్నారు. వాటి కోసం జనం కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు చూసుకుంటే విపక్షాలు బొత్తిగా పస లేని ఆరోపణలు చేస్తున్నాయని అంటున్నారు. ఇసుక మాఫియా అన్న పదానికి అర్ధం చెప్పిన‌దే టీడీపీ సర్కార్. అటువంటి టీడీపీ ఈ రోజు ఇసుక కోసం ధర్నా చేస్తే దానికి విలువ ఏముంటుందని వైసీపీ నేతలే అంటున్నారు. అందుకే ఆ అందోళన తుస్సుమంది. మరో వైపు వరదలు ముంచెత్తుతూంటే ఇసుక కొరత అంటూ విపక్షాలు గోల చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.


ఇక జనసేన తీసుకుంటే సొంత అజెండా లేకుండా జగన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లుగా పవన్ ఫోకస్ అయిపోయారు. కొత్త రాజకీయం అని వచ్చిన పవన్ అదేమీ చూపించలేకపోతున్నారు. బాబు కంటే ధీటుగా మిన్నగా రాజకీయం చేస్తే ఏపీలో జనసేనకు అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం బాబు నీడ నుంచి బయటపడలేకపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ, వామపక్షాలు చేస్తున్న అరోపణలు కూడా తేలిపోతున్నాయి. బీజేపీ ఏపీకి పెద్దగా సాయం చేయకుండా వూరికే బండలు వేస్తోందన్న విషయమే  జనాలకు రీచ్ అవుతోంది. వామపక్షాలు షరా మామూలు ఆందోళన‌లుగా వీటిని చూస్తున్నారు. కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఆ పార్టీ  ఉనికి పోరు కూడా లేనట్లుగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో విపక్షం బాగా వీక్ గా ఉందని అంటున్నారు. ఇదే తీరు కొనసాగితే 2024లో కూడా అంతా కలసి  మళ్ళీ జగన్ కే అధికారం  అప్పగించేట్లున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: