ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్ల పోస్టుల కనీస అర్హతను ఇంటర్ నుండి పదవ తరగతికి తగ్గించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,92,964 గ్రామ, వార్డ్ వాలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 1,83,290 మంది విధులలో చేరారు. వివిధ కారణాల వలన 9,674 పోస్టులు భర్తీ కాలేదు. మిగిలిన 9,674 గ్రామ, వార్డ్ వాలంటీర్ల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఆగష్టు నెలలో వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో కనీస అర్హత గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి, ఇతర ప్రాంతాల్లో ఇంటర్మీడియెట్ గా ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ప్రభుత్వ ప్రభుత్వ కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గిరిజన ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పదవ తరగతి విద్యార్హతతో పోస్టులను భర్తీ చేయటానికి అనుమతి తెలుపుతూ ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1వ తేదీన గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 
 
గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ధరఖాస్తు చేసే అభ్యర్థుల నుండి ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ ద్వారా అధికారులు ధరఖాస్తులను స్వీకరిస్తారు. ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ నవంబర్ 16వ తేదీ నుండి 20వ తేదీ మధ్య ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారికి 22వ తేదీన అధికారులు సమాచారం అందిస్తారు. 
 
గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నవంబర్ నెలలో చివరి రెండు రోజులు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ నెల 1వ తేదీ నుండి గ్రామ, వార్డ్ వాలంటీర్ల పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రభుత్వం ప్రతి నెల 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తుంది. వైసీపీ ప్రభుత్వం కనీస విద్యార్హత తగ్గించటంతో ఎక్కువ మంది అభ్యర్థులు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: