ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్, సివియర్ హీమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల​కు రూ. 10 వేలు పెన్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బోధకాలు, పక్షవాతం, ప్రమాద బాధితులకు నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇవ్వనున్నట్టు ఇందులో పేర్కొంది.


తలసేమియా, సికిల్సెల్ డిసీజ్, సివియల్ హీమోఫీలియా వంటివి చాలా భయంకరమైన జబ్బులు. తలసేమియా అయితే ప్రతినెలా రోగి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి వారికి మందుల కోసమే నెల నెలా వేలకు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సామాన్యులకు ఇలాంటి బజ్బు వస్తే ఇప్పటి వరకూచావే గతి. జగన్ తన నిర్ణయంతో అలాంటి రోగుల కుటుంబాల్లో జనమైన దీపావళి తీసుకొచ్చారనే చెప్పాలి.


జనవరి 1 నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించింది. జగన్ నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంకా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సీఎం జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ప్రతిష్టాత్మక డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు జగన్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.


ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఏపీ రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో... ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి.. 716 సూపర్ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: