ఇటీవల తెలంగాణలోని హుజూర్ నగర్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి కేవలం 1800 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనిపై congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఛలోక్తులు విసిరారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమేనని congress PARTY YSRCP' target='_blank' title='వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


పోలైన ఓట్లలో ఒక్క శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడంటూ సెటైర్ వేశారు. మళ్లీ తానే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చంద్రబాబు కలవరిస్తున్నారన్నారు. 'ఎయిర్ పోర్టులో చిరు తిండ్ల ఖర్చు 25 లక్షలు, ఒక్క రోజు ధర్నాకు 10 కోట్లు... ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాలా పెద్దది వస్తుందన్నారు.


కొందరు పదవిలో ఉన్నది అనుభవించడానికే అనుకుంటారు. ఇసుక కొరత అని ఆందోళనకు దిగుతున్న పచ్చ పార్టీ, బానిస పార్టీలు కోరుకునేదేమిటంటే... వర్షాలు కురవొద్దు. నదులు, వాగులు ఉప్పొంగకూడదు. రిజర్వాయర్లు నిండొద్దు. నదులన్నీ ఎండిపోయి ఇసుక రాశులు తేలి ఉంటే ఏ కొరతా ఉండదు. ఇటువంటి తిరోగమన ఆలోచనలున్న వాళ్లు భూమికి భారం కాక మరేమిటి? అని ట్విట్టర్‌లో స్పందించారు.


వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొన్న కూడా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై ట్వీట్ ద్వారా విమర్శల వర్షం కురిపించారు. నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా చంద్రబాబు స్కెచ్ వేశారని congress PARTY YSRCP' target='_blank' title='వైయస్‌ఆర్‌సీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే, ముందు నుంచి బీజేపీ జెండా మోస్తున్నవారిని ఎదగనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని పేర్కొన్నారు.


తెలంగాణ కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని... తద్వారా ఆ పార్టీని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఏపీలో తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

మప

మరింత సమాచారం తెలుసుకోండి: